బీజేపీకి ఓటేయాలనందుకు దాడి చేసిన బీఆర్ఎస్ నాయకులు

బీజేపీకి ఓటేయాలనందుకు దాడి చేసిన బీఆర్ఎస్ నాయకులు

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మద్య ఘర్షణ  చోటుచేసుకుంది. బీజేపీకి ఓటు వేయాలని  చెప్పినందుకు నేతుల‌ మల్లేశం అనే వ్యక్తి పై బీఆర్ఎస్ నాయకులు మూకుమ్మడిగా దాడి చేశారు.   టాటా ఏసీ వాహానంతో ఢీకొట్టడంతో మల్లేశం అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు  ఆసుపత్రికి తరలించారు.  ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.  కాగా నిజామాబాద్  జిల్లాలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 45.67 శాతం పోలింగ్ నమోదైంది.  

మరోవైపు తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40.38  శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. హైదరాబాద్ లో 19. 37%, మల్కాజిగిరిలో 27. 69%,  సికింద్రాబాద్ లో 24.91%, చేవెళ్ల34.56%, పెద్దపల్లిలో  45.12%, మహబూబాబాద్ లో 48.81%, నిజామాబాద్ లో 45.67%,  పోలింగ్ నమోదైంది.