ప్రముఖ టెక్ కంపెనీ విప్రో హైబ్రిడ్ వర్క్ విధానంలో కీలక మార్పులు చేసింది. హైబ్రిడ్ వర్క్ రూల్స్లో ఉద్యోగులకు కొన్ని కఠిన పరిమితులు విధించింది. హైబ్రిడ్ వర్క్ విధానంలో.. ఆఫీస్కు తప్పనిసరిగా వెళ్లి పని చేసే రోజుల్లో కచ్చితంగా ఆరు గంటలు ఆఫీస్లోనే ఉండి పనిచేయాలని ఉద్యోగులకు విప్రో స్పష్టం చేసింది.
జనవరి 1 నుంచే ఆఫీస్లో ఈ తప్పనిసరి పని గంటల విధానాన్ని అమల్లోకి తెచ్చినట్లు విప్రో తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా విప్రోలో 2 లక్షల 34 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆఫీస్లో పనిచేసే రోజుల్లో ఆరు గంటలు తప్పనిసరిగా ఉండకపోతే ఆఫ్ డే లీవ్ కట్ అని ఉద్యోగులకు విప్రో కుండబద్ధలు కొట్టింది.
విప్రో ప్రస్తుతం ఉద్యోగుల డైలీ వర్కింగ్ టైంను 9.5 గంటలకు ఫిక్స్ చేసింది. ఇందులో.. ఆరు గంటలు ఆఫీస్లో పనిచేసి.. మిగిలిన మూడున్నర గంటల ఉద్యోగ సమయం వర్క్ ఫ్రం హోంలో అదే రోజు చేయాల్సి ఉంటుంది.
►ALSO READ | హరిద్వార్లో 105 ఘాట్లలో హిందువులు కాని వాళ్లకు నో ఎంట్రీ..
అంతేకాదు.. తాత్కాలికంగా వర్క్ ఫ్రం హోం చేసే అవకాశం సంవత్సరానికి 15 రోజుల నుంచి 12 రోజులకు కుదించింది. కుటుంబ సభ్యుల బాగోగులు చూసుకునే నిమిత్తం, సెల్ఫ్ కేర్.. ఇతర కారణాల వల్ల ఉద్యోగులు 12 రోజుల పాటు ఆఫీస్కు రాకుండా వర్క్ ఫ్రం చేసుకునే అవకాశమే ఇది.
