ఉత్తరాఖండ్ ప్రభుత్వం మరో కఠిన నిర్ణయానికి సిద్ధమైంది. కుంభమేళ వంటి అతిపెద్ద జాతర నిర్వహించిన ఆ రాష్ట్రం లేటెస్టుగా.. అలాంటి తీర్థయాత్రల నిర్వహణపై షాకింగ్ నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొంది. త్వరలో వచ్చే అర్థ కుంభ్ ఉత్సవాలకు హిందువులు కానివారిని బ్యాన్ చేయాలనే నిర్ణయానికి వచ్చింది. హరిద్వార్ లోని 105 ఘాట్ లలోకి నాన్ హిందూస్ కు ఎంట్రీ లేకుండా బ్యాన్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. 120 కిమీ పరిధిలోకి హిందువులు కాని వారు రావడానికి వీళ్లేకుండా పాత చట్టాన్ని పునరుద్ధరించనుంది.
గంగా సభ లో ఉన్న సభ్యుల డిమాండ్ మేరకు.. ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకునేందుకు సిద్ధమైంది. హరిద్వార్ లోని హర్–కి–పూరి ఘాట్ ను పర్యవేక్షించే గంగా సభ డిమాండ్ మేరకు ఆ దిశగా చర్యలు ప్రారంభించింది ప్రభుత్వం. దీనికితోడు హరిద్వార్, రిషికేష్ లను సనాతన్ పవిత్ర షెహర్ (పవిత్ర నగరాలు) గా ప్రకటించేందుకు సిద్ధమైంది. 2027 జనవరి 14.. మకర సంక్రాంతి సందర్భంగా వస్తున్న అర్థ కుంభ్ (అర్థ కుంభమేళా) ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
►ALSO READ | ఆమె శవం మీద దొరికిన ఆమ్లెట్ ముక్కతో మర్డర్ మిస్టరీ సాల్వ్.. కేస్ క్లోజ్..!
గతంలో.. 1916లో బ్రిటిష్ ప్రభుత్వంతో భారత రత్న పండిట్ మదన్ మోహన్ మాలవీయ చేసుకున్న ఒప్పందంపై ప్రభుత్వం పరిశీలిస్తోంది. గంగా సభకు మాలవీయ మొదటి అధ్యక్షుడు. గంగా నది పవిత్రతను కాపాడేందుకు, పుష్కరాలు, కుంభమేళ వంటి ఉత్సవాల నిర్వహణ సందర్భంగా హిందువుల పవిత్రత కోసం, అప్పట్లో హిందూయేతరులను బ్యాన్ చేశారు. ఆ ఒప్పందం ప్రకారం.. నాన్ హిందూస్.. ఆ ప్రాంతంలో (అంటే రిషికేష్, హరిద్వార్) స్థిర నివాసం ఏర్పర్చుకునే హక్కు కూడా లేనట్లు.. కేవలం పనికోసం రావడం.. పూర్తయిన వ ఎంటనే వెళ్లిపోవడం చేయాల్సిందిగా అగ్రిమెంట్ లో పేర్కొన్నారు. గతంలో ఉన్న అసలైన ఒప్పందాన్ని మళ్లీ అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
