మీర్‌పేట్‌లో ప్రైవేట్ హాస్టల్‌లో కొత్తగూడెం జిల్లా యువతి ఆత్మహత్య

మీర్‌పేట్‌లో ప్రైవేట్ హాస్టల్‌లో కొత్తగూడెం జిల్లా యువతి ఆత్మహత్య

హైదరాబాద్: మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఓ ప్రైవేట్ హాస్టల్‎లో ఫ్యాన్‎కు ఉరి వేసుకుని చనిపోయింది. వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం నర్సాపురం గ్రామానికి చెందిన కనుకూ నర్సింహారావు పెద్ద కుమార్తె కనుకూ సరస్వతి (21) మీర్‌పేట్‌లోని టీకేఆర్ కాలేజ్ ఎదురుగా ఉన్న డీడీయూ సెంటర్‌లో కంప్యూటర్ కోర్సు నేర్చుకుంటుంది. 

సమీపంలోని సూపర్ స్టూడెంట్స్ గల్స్ హాస్టల్‎లో ఉంటోంది. ఏమైందో తెలియదు గానీ 2025, జనవరి 4న సాయంత్రం హాస్టల్‎లో ఫ్యాన్‎కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గది తలుపులు ఎంతకు తెరవకపోవడంతో హాస్టల్‎లో ఇతర అమ్మాయిలు బలవంతంగా డోర్ ఓపెన్ చేసి చూడగా సరస్వతి చున్నీతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. 

►ALSO READ | బాడీ ఇటు కాళ్లు అటు.. కిచెన్ ఫ్యాన్ రంధ్రంలో ఇరుక్కుని నరకం చూసిన దొంగ.. వీడియో వైరల్

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. సరస్వతి మరణంపై ఆమె తండ్రి అనుమానం వ్యక్తం చేశాడు. హాస్టల్ యాజమాన్యం, కోచింగ్ సెంటర్ యాజమాన్యం, అలాగే ఆస్వాపురానికి చెందిన పి. నంద కిషోర్ పాత్ర ఉందని మీర్‎పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.