జగిత్యాల రూరల్, వెలుగు: మాజీ మంత్రి జీవన్ రెడ్డిని జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో ఎంపీ గడ్డం వంశీకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు బర్త్ డే విషెష్ చెప్పారు. అనంతరం పాస్టర్ లాజరస్ ఆధ్వర్యంలో ప్రేయర్ చేశారు. అంతకుముందు జిల్లాలోని పలు మండలాల్లో ఇటీవల చనిపోయిన వారి కుటుంబసభ్యులను కలిసి ఎంపీ వంశీకృష్ణ పరామర్శించారు. బుగ్గారం మండలం గోపాల్‌పూర్ గ్రామంలో మాజీ జడ్పీటీసీ బాదినేని రాజేందర్ తండ్రి ఇటీవల చనిపోగా.. కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ధర్మారం మండలం కేంద్రంలోని సాక్షి రిపోర్టర్ కల్యాణ్ స్వామిరెడ్డి తల్లి, కటికనపల్లి గ్రామానికి చెందిన అనపురం లింగయ్య గౌడ్, కొత్తూరు గ్రామంలో మేకల కుమార స్వామి తల్లి, పెగడపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బుర్ర రాములు తల్లి.. ఇటీవల చనిపోగా.. వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గోపాల్‌పూర్, పెగడపల్లిలో ఇటీవల ఎన్నికైన సర్పంచ్, ఉపసర్పంచ్‌లను, పాలకవర్గాలను సన్మానించారు.
