హుజూరాబాద్ పట్టణంలో 290 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

హుజూరాబాద్ పట్టణంలో 290 క్వింటాళ్ల  రేషన్ బియ్యం పట్టివేత

హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో అక్రమంగా తరలిస్తున్న 290 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. పోలీసుల వివరాల ప్రకారం.. పట్టణంలోని లవకుశ రైస్ మిల్లు నుంచి రేషన్ బియ్యం తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో మంగళవారం పోలీసులు దాడులు నిర్వహించారు. 

లారీలో లోడ్‌‌‌‌‌‌‌‌ చేసిన సుమారు 290  క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు బియ్యం తరలిస్తున్న వ్యక్తి పై కేసు నమోదు చేసి, తదుపరి చర్యల కోసం సివిల్ సప్లై అధికారులకు అప్పగిస్తామని టౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు.