దేశ భవిష్యత్‌‌‌‌‌‌‌‌ను నిర్మించే మౌన కర్మాగారం సరస్వతి శిశు మందిర్ : మంత్రి బండి సంజయ్ కుమార్

దేశ భవిష్యత్‌‌‌‌‌‌‌‌ను నిర్మించే మౌన కర్మాగారం సరస్వతి శిశు మందిర్ : మంత్రి బండి సంజయ్ కుమార్
  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ 

కరీంనగర్, వెలుగు: దేశ భవిష్యత్‌‌‌‌‌‌‌‌ను నిర్మించే మౌన కర్మాగారం సరస్వతి శిశు మందిర్ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. నవ భారత నిర్మాణానికి కృషి చేసే శిల్పులు శిశుమందిర్ గురువులని కొనియాడారు. ఇంత గొప్ప స్కూల్‌‌‌‌‌‌‌‌లో చదువుకోవడం గర్వంగా ఉందన్నారు. కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీలోని సరస్వతి శిశు మందిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెండు రోజుల పాటు నిర్వహించే ఆటల పోటీల(ఖేల్ ఖుద్) ప్రారంభ కార్యక్రమానికి మంగళవారం బండి సంజయ్ హాజరయ్యారు.

అనంతరం పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడారు. టీచర్లతో కలిసి ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిశుమందిర్ లో చదువుకున్న ఎంతో మంది అధికారులు, రాజకీయ నేతలు అయ్యారని, తాను శిశు మందిర్ లో చదువుకోవడంవల్లే ఈ స్థాయికి చేరుకుని ప్రజలకు సేవ చేయగలుగుతున్నానని తెలిపారు. సంస్కారం, సైన్స్, స్పోర్ట్స్ కలిపితే శిశుమందిర్ విద్య అవుతుందని ప్రశంసించారు.