కామారెడ్డి జిల్లాలో రూ.50 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్

కామారెడ్డి జిల్లాలో రూ.50 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్

వారసత్వంగా వచ్చిన భూమిని వ్యక్తి పేరున మార్చేందుకు లంచం డిమాండ్ చేసి ఏసీబీకి పట్టుబడ్డాడు కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ తహసీల్దార్. ఒప్పందం ప్రకారం 50 వేల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. నాగిరెడ్డిపేట మండల తహసీల్దార్ యార్లగడ్డ శ్రీనివాసరావు, మరో వ్యక్తితో కలిసి 50 వేల రూపాయలు తీసుకుంటుండగా మంగళవారం (జనవరి 06) ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే.. ఒక వ్యక్తి తన తండ్రి పేరు మీద ఉన్న వ్యవసాయ భూమిని తన పేరు మీదకు మార్చుకోవడానికి దరఖాస్తు చేసుకున్నాడు. అందుకు రూ.50,000 లంచం డిమాండ్ చేశాడు ఎమ్మార్వో శ్రీనివాసరావు . 50 రూపాయలను చిన్నూరి అజయ్ అనే వ్యక్తికి అందజేయాలని సూచించాడు. 

►ALSO READ | తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యవర్గ అత్యవసర సమావేశం.. భేటీకి హాజరైన కవిత ఇద్దరు కుమారులు

రిజిస్ట్రేషన్ కోసం 50 వేల రూపాయలు చెల్లించుకోలేని వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో చెప్పిన సమయానికి డబ్బులు అందజేయాలని చెప్పారు అధికారులు. ఆ తర్వాత అజయ్ తహసీల్దార్ కు డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించిన అజయ్‌ ని కూడా ఏసీబీ అరెస్ట్ చేసింది. అనంతరం ఇద్దరినీ హైదరాబాద్‌లోని నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.