కరెంట్‌‌‌‌షాక్‌‌‌‌ తో కౌలురైతు మృతి..నిజామాబాద్‌‌‌‌ జిల్లా  జాకోరా గ్రామంలో ఘటన

కరెంట్‌‌‌‌షాక్‌‌‌‌ తో కౌలురైతు మృతి..నిజామాబాద్‌‌‌‌ జిల్లా  జాకోరా గ్రామంలో ఘటన

వర్ని, వెలుగు : కరెంట్‌‌‌‌ షాక్‌‌‌‌తో కౌలు రైతు చనిపోయాడు. ఈ ఘటన నిజామాబాద్‌‌‌‌ జిల్లా వర్ని మండలం జాకోరా గ్రామంలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... గ్రామానికి చెందిన గుట్టమీది గంగాధర్‌‌‌‌ (37) ఆర్‌‌‌‌ఎంపీగా పనిచేయడంతో పాటు కొంత పొలం కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు.

బుధవారం ఉదయం పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన గంగాధర్‌‌‌‌ మోటార్‌‌‌‌ ఆన్‌‌‌‌ చేస్తుండగా.. విద్యుత్‌‌‌‌ షాక్‌‌‌‌ కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు.