కారు నడపాలన్న సరదా ప్రాణాలు తీసింది.. నిజామాబాద్ జిల్లాలో విషాదం

కారు నడపాలన్న సరదా ప్రాణాలు తీసింది.. నిజామాబాద్ జిల్లాలో విషాదం

కారు నడపాలన్న సరదా ప్రాణాలను బలితీసుకుంది. స్నేహితులతో కలిసి కారు నడుపుతూ అదుపుతప్పి కాల్వలో పడటంతో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం (మార్చి 12) నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. అర్థరాత్రి వేళ జరిగిన ఈ ఘటన గురించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

ఆలూరు మండలం గుత్ప గ్రామ సమీపంలో అర్ధరాత్రి వేళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బోల్తా పడి యువకుడు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గుత్ప గ్రామానికి చెందిన నారాయణ ప్రమాద తీవ్రతకు అక్కడికక్కడే మృతి చెందాడు. 

కారు నడపాలన్న సరదా కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయా యువకుడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. గుత్ప నుండి ఆలూర్ వెళ్లే రోడ్డు మార్గమధ్యలో ఉన్న కాల్వలో కారు బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో గుత్ప గ్రామంలో విషాదఛాయలు  నెలకొన్నాయి. 

గ్రామ ఉపసర్పంచ్ చెప్పిన వివరాల ప్రకారం.. అర్థరాత్రి కారు ప్రమాదం జరిగింది. గ్రామస్తుల సమాచారంతో వెళ్లి చూస్తే కారులో ఒక వ్యక్తి కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. రాయితో అద్దాలు పగలగొట్టి ప్రవీన్ అనే వ్యక్తిని కాపాడాం. మరో వ్యక్తిని బయటకు తీస్తే అప్పటికే చనిపోయి ఉన్నాడు. పోలీసులకు సమాచారం అందించి.. అంబులెన్స్ సహాయంతో ఆసుపత్రికి తరలించాం.. అని గ్రామ ఉపసర్పంచ్ ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.