హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత హాట్ టాపిక్‌గా మారారు. బీఆర్ఎస్ నుంచి సస్పెండైన తర్వాత గులాబీ పార్టీపై ఆమె చేస్తోన్న విమర్శలు స్టేట్ పాలిటిక్స్‌లో కాక పుట్టిస్తున్నాయి. తనపై కుట్ర చేసి అన్యాయంగా పార్టీ నుంచి గెంటేశారని ఆమె ఏకంగా శాసన మండలిలోనే కంటతడి పెట్టుకున్నారు. మరోవైపు త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని కవిత ప్రకటించడం స్టేట్ పొలిటికల్ కారిడార్స్‌లో చర్చనీయాంశంగా మారింది.
ఈ పరిణామాల నేపథ్యంలో మంగళవారం (జనవరి 6) తెలంగాణ జాగృతి రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి కవిత పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని జాగృతి ప్రధాన కార్యాలయంలో కవిత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 23 జాగృతి అనుబంధ సంస్థల నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కొత్త పార్టీ ఏర్పాటు వంటి కీలక అంశాలపై ఈ భేటీలో డిస్కస్ చేసినట్లు తెలిసింది. 2026 ఫిబ్రవరి 16 లేదా 20వ తేదీన మంచిర్యాలలో భారీ బహిరంగా సభ ఏర్పాటు చేయాలని చర్చించినట్లు సమాచారం. ఇదే సభలో కొత్త పార్టీని ప్రకటించాలని మాట్లాడినట్లు టాక్.
గతంలో టీజీబీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా కవిత పని చేసిన విషయం తెలిసిందే. దీంతో కవితకు మంచిర్యాలలో మంచి పట్టుంది. దీంతో ఆమె ఇక్కడి నుంచి పోటీ చేసే అంశంపై కూడా ఈ భేటీలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. కవిత టీజీబీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా పని చేయడంతో ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఆమెకు అడ్వాంటేజ్‌గా మారుతుందని సన్నిహితులు, కార్మిక నేతలు సూచించినట్లు సమాచారం. అయితే.. ఈ సమావేశానికి కవిత ఇద్దరు కొడుకులు హాజరు కావడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీసింది. తన ఇద్దరు కొడుకులను కవిత ఈ భేటీకి తీసుకు రావడానికి వెనక ఉన్నవ్యూహం ఏంటనే దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
