నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దారుణ హత్య 

నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దారుణ హత్య 

నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఇమ్మడి గోపి దారుణ హత్యకు గురయ్యాడు. ఇందల్వాయి శివారులో కారుపై అటాక్ చేసి హత్య చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్‎లో లొంగిపోయాడు నిందితుడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. 

ఉమ్మడి గోపిని హత్య చేసిన వ్యక్తి ఆయన సమీప బంధువుగా గుర్తించారు. పాత కక్షల కారణంగా హత్యచేసినట్లు భావిస్తున్నారు పోలీసులు. ఇందల్వాయి మాజీ ఎంపీపీగా పనిచేసిన గోపి.. ప్రస్తుతం ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకునిగా పని చేస్తున్నారు. గౌరారం సర్పంచ్‎గా ఇటీవలే ఎన్నికైన ఇమ్మడి గోపి భార్య హేమలత.