సుందిళ్ల టెంపుల్‌‌‌‌‌‌‌‌ లో ఎంపీ వంశీకృష్ణ పూజలు

సుందిళ్ల  టెంపుల్‌‌‌‌‌‌‌‌ లో ఎంపీ వంశీకృష్ణ పూజలు

గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి పార్లమెంట్ ​పరిధిలోని ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆకాంక్షించారు. మంగళవారం రామగిరి మండలం సుందిళ్ల గ్రామంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి ఎంపీ ప్రత్యేక పూజలు  చేశారు. 

అంతకుముందు ఎంపీకి ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఆయన వెంట కాంగ్రెస్​సీనియర్​లీడర్​ పి.మల్లికార్జున్, కామ విజయ్, రఘునాథరెడ్డి, తదితరులున్నారు.