దీక్షలో ఉన్న స్టూడెంట్లను అనుమతించలేదని.. స్కూల్ ఎదుట హనుమాన్ స్వాముల ఆందోళన

దీక్షలో ఉన్న స్టూడెంట్లను అనుమతించలేదని.. స్కూల్ ఎదుట హనుమాన్ స్వాముల ఆందోళన

కోరుట్ల, వెలుగు: జగిత్యాల జిల్లా మెట్​పల్లిలోని ఓ ప్రైవేట్ స్కూల్​లో హనుమాన్  దీక్షలో ఉన్న ఐదుగురు స్టూడెంట్లను స్కూల్ లోకి అనుమతించ లేదని పేర్కొంటూ హనుమాన్​  దీక్షాపరులు, స్టూడెంట్స్, పేరెంట్స్ స్కూల్​ ఎదుట ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి..

మెట్ పల్లి లోని నిఖిల్  భారత్  స్కూల్ లో చదువుతున్న ఐదుగురు స్టూడెంట్స్​ హనుమాన్ దీక్ష  తీసుకున్నారు. దీక్ష తీసుకుంటే స్కూల్​కు అనుమతించమని,  21 రోజుల పాటు స్కూల్​కు రావద్దని యాజమాన్యం స్టూడెంట్స్​తో లీవ్  లెటర్  రాయించుకుంది.

ఈ విషయాన్ని స్టూడెంట్స్​ పేరెంట్స్​కు తెలియజేయడంతో స్కూల్  ఎదుట స్టూడెంట్స్, పేరెంట్స్, దీక్షాపరులు బైఠాయించారు. స్కూల్​లోని ఫర్నిచర్  ధ్వంసం చేశారు. హనుమాన్  దీక్ష తీసుకుంటే స్కూల్​కు రావద్దని చెప్పడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్కూల్​కు రానివ్వకుండా రూల్స్​ పెట్టడం సరైంది కాదన్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై కిరణ్​కుమార్​ స్కూల్​కు చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడి శాంతింపజేశారు. స్కూల్  యాజమాన్యంతో మాట్లాడి  క్లాస్ రూంలోకి స్టూడెంట్స్​ను అనుమతించడంతో వివాదం సద్దుమణిగింది.