- మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి
కరీంనగర్ సిటీ, వెలుగు: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దౌర్జన్యాలపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడాలని సీపీఐ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట రెడ్డి డిమాండ్ చేశారు. ఇరాన్‌పై అమెరికా యుద్ధం నేపథ్యంలో దేశంలో గ్యాస్ కొరతకు వ్యతిరేకంగా కరీంనగర్ గీతా భవన్ చౌరస్తాలో సోమవారం సీపీఐ నేతలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో కట్టెల పొయ్యిలే దిక్కని సూచిస్తూ కట్టెల పొయ్యిని అంటించి, గ్యాస్ సిలిండర్లను ఎత్తుకొని నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టాక ప్రపంచ దేశాలపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నాడన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు బోయిని అశోక్, న్యాలపట్ల రాజు, కౌన్సిల్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
