సిర్సపల్లిలో డంప్‌‌‌‌‌‌‌‌యార్డు ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకోవాలి : ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్

సిర్సపల్లిలో డంప్‌‌‌‌‌‌‌‌యార్డు ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకోవాలి : ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్

    ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్

హుజూరాబాద్ రూరల్,​ వెలుగు: హుజూరాబాద్​పట్టణం సమీపంలోని సిర్సపల్లిలో ఏర్పాటు చేయనున్న డంపింగ్ యార్డు ప్రతిపాదనను విరమించుకోవాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్​ప్రభుత్వాన్ని కోరారు. సిర్సపల్లి డంపింగ్ యార్డ్ సమస్యపై మంగళవారం శాసనమండలిలో ఎమ్మెల్సీ మాట్లాడారు. గ్రామ సమీపంలో డంపింగ్‌‌‌‌‌‌‌‌ యార్డులో ఏర్పాటు చేస్తే వ్యర్థాలను కాల్చడం వల్ల గాలిలోకి విడుదలయ్యే కాడ్మియం, క్రోమియం వంటి రసాయనాలతో ప్రజలు రోగాల బారినపడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.   

గత ప్రభుత్వ హయంలో ఈ ప్రతిపాదన ఎలా చేశారో తెలియదని , ఈ విషయమై అక్కడి ప్రజలు, రైతులు, తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నందున వెంటనే డంపింగ్​యార్డును వెంటనే అక్కడి నుంచి తరలించాలని కోరారు.