ఇయ్యాల నుంచి  డీఈఈసెట్ దరఖాస్తులు

ఇయ్యాల నుంచి  డీఈఈసెట్ దరఖాస్తులు
  • ఏప్రిల్15 వరకు అప్లై చేసుకునేందుకు చాన్స్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని డైట్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే డీఈఈసెట్ దరఖాస్తుల ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభం అవుతుందని ఎస్‌‌‌‌సీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్ తెలిపారు. రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సుల్లో 2026–28 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టినట్టు చెప్పారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు.

ఈ నెల15న ఉదయం10.30గంటల నుంచి ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ దరఖాస్తుల ప్రక్రియ మొదలవుతుందని, ఏప్రిల్ 15వ తేదీ రాత్రి 11:30 గంటల వరకు అప్లై చేసుకోవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మే 21, 22 తేదీల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందని వెల్లడించారు. ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ,  దివ్యాంగ అభ్యర్థులు రూ.450 దరఖాస్తు రుసుమును ఆన్‌‌‌‌లైన్ పేమెంట్ గేట్‌‌‌‌వే ద్వారా చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు https://deecet.cdse.telangana.gov.in వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.