జగిత్యాల రూరల్, వెలుగు: మాజీ మంత్రి జీవన్ రెడ్డి బర్త్ డే వేడుకలు జగిత్యాలలోని ఇందిరాభవన్‌లో సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు జీవన్‌రెడ్డికి బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. గజమాల వేసి అభిమానం చాటుకున్నారు. అనంతరం ఆయన కేక్ కట్ చేశారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో తనపై రూపొందించిన పాటను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు పదవి లేకున్నా ప్రజా సమస్య ల పరిష్కారానికి నిత్యం శ్రమిస్తానన్నారు.
ఆయా కార్యక్రమాల్లో డీసీసీ ప్రెసిడెంట్ గాజెంగి నందయ్య, జున్ను రాజేందర్, ఎండీ సలీం, వివిధ గ్రామాల గ్రామాల సర్పంచులు నల్ల కవిత, పొట్టవత్తిని సతీశ్, మిల్కూరి శంకరయ్య, ఆకుల అంజన్న, నల్లాల స్వామిరెడ్డి, బానోత్ వనిత, కొత్తకొండ రోజా, మాలోత్ ప్రసాద్, చేకూట అరుణ, ఆకుల రమేశ్, రాధ, శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
రాయికల్, వెలుగు: రాయికల్ పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలను సోమవారం కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా జరిపారు. గాంధీ చౌక్, అంగడి బజార్, భూపతిపూర్, మూటపెళ్లి, ఇటిక్యాల, ఒడ్డెలింగాపూర్, కొత్తపేట, బోర్నపల్లి గ్రామాల్లో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మ్యాకల రమేశ్, బ్లాక్ అధ్యక్షుడు గోపి రాజారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మహేందర్ గౌడ్, పట్టణ మహిళా అధ్యక్షురాలు మమత, యూత్ మండల, పట్టణ అధ్యక్షులు ఏలేటి జలందర్ రెడ్డి, బత్తిని నాగరాజు, ఇతర లీడర్లు పాల్గొన్నారు.
