నిజామాబాద్ జిల్లాలో హోటళ్లలో డొమెస్టిక్ సిలిండర్లు... సీజ్ చేసిన అధికారులు

నిజామాబాద్ జిల్లాలో హోటళ్లలో డొమెస్టిక్ సిలిండర్లు... సీజ్ చేసిన అధికారులు

ఇరాన్ యుద్ధం కారణంగా దేశంలో గ్యాస్ టెన్షన్ తీవ్రమవుతోంది. కమర్షియల్ సిలిండర్ల కొరతతో ఇప్పటికే చాలా వరకు హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డ పరిస్థితి. కొంతమంది హాస్టల్, రెస్టారెంట్ల నిర్వాహకులు కట్టెల పొయ్యిని వాడుతున్నారు.ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లాలో హోటళ్లపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. 

నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ లో టిఫిన్ సెంటర్లు, హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లలో డొమెస్టిక్ సిలిండర్లు వాడుతున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించారు అధికారులు. ఈ దాడుల్లో సుమారు 50 సిలిండర్లు సీజ్ చేసినట్లు తెలిపారు అధికారులు.

డొమెస్టిక్ సిలిండర్లు వాడితే కఠిన చర్యలు తప్పవని.. కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు అధికారులు. ఇదిలా ఉండగా.. జగిత్యాల జిల్లాలో గురువారం ( మార్చి 12 ) హోటళ్ళు,రెస్టారెంట్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు అధికారులు.పలు హోటళ్లలో ఇరవైకి పైగా సిలిండర్లను సీజ్ చేశారు అధికారులు. 

ALSO READ : కడప జిల్లాలో అమానుష ఘటన.. భార్య ఉరేసుకుంటుంటే నవ్వుతూ వీడియో తీసిన భర్త !

గృహ వినియోగానికి కేటాయించిన గ్యాస్ సిలిండర్లను అక్రమంగా వాడుతున్న హోటళ్లపై సివిల్ సప్లై అధికారుల చర్యలు తీసుకున్నారు. అక్రమంగా సిలిండర్లు వాడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు అధికారులు.గృహ వినియోగదారులు కూడా గ్యాసు పొదుపుగా వినియోగించాలని.. సిలిండర్ బుకింగ్ వ్యవధిని 25 రోజుల నుంచి 45 రోజులకు పెంచినట్లు తెలిపారు అధికారులు.