హైదరాబాద్ సిటీ నడిబొడ్డున కొత్త ఫ్లై ఓవర్ : జూబ్లీహిల్స్ రోడ్ నెం 45 ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ సిటీ నడిబొడ్డున కొత్త ఫ్లై ఓవర్ : జూబ్లీహిల్స్ రోడ్ నెం 45 ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) నుండి శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ రోడ్డు వరకు 9 కి.మీ ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.

ఈ ప్రాజెక్ట్ చాల చోట్ల ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గిస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా రోడ్డు నంబర్ 45 జూబ్లీ హిల్స్, ఫిల్మ్ నగర్, జూబ్లీ హిల్స్ చెక్‌పోస్ట్ వంటి కొన్ని ట్రాఫిక్ రద్దీ ప్రదేశాలు ప్రయాణికులకి ఉపశమనం కలిగిస్తాయి. ఈ ఎలివేటెడ్ కారిడార్ మీనాక్షి టవర్స్ నుండి హైటెక్ సిటీ వైపు వెళ్లే రహదారిపై ట్రాఫిక్‌ను కూడా తగ్గిస్తుంది. దీనికి తోడు ఈ కారిడార్ సిటీ  నుండి బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ మీదుగా నానక్‌రామ్‌గూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఇతర ఆఫీసుల వైపు వచ్చే ట్రాఫిక్‌ను తగ్గిస్తుంది.

అదేవిధంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని కంపెనీలలో పనిచేసే ఐటీ ఉద్యోగులు, సిబ్బందితో పాటు ఈ ప్రాజెక్ట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని డజన్ల కొద్దీ హౌసింగ్ సొసైటీలలో నివసిస్తున్న నివాసితులకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ ఎలివేటెడ్ కారిడార్ బంజారా హిల్స్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతం ద్వారా కోర్ సిటీలోకి ప్రవేశించడానికి, నిష్క్రమించడానికి ఉపయోగించబడుతుంది.

ALSO READ : ఫాల్కన్ స్కామ్ లో కీలక పురోగతి..

ఈ మధ్య కాలంలో HMDA ప్రతిపాదించిన మూడవ ఎలివేటెడ్ కారిడార్ ఇది, ఇందులో NH-44లో ప్యారడైజ్ జంక్షన్ నుండి షామీర్‌పేట్ ORR వరకు అలాగే  ప్యారడైజ్ జంక్షన్ నుండి డైరీ ఫామ్ రోడ్ వరకు మరో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి.

“ICCC నుండి శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ రోడ్ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కోసం డీటేల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్  (DPR) తయారీకి మేము కన్సల్టెంట్‌ను కూడా నియమిస్తున్నాము. బంజారా హిల్స్,  శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ రోడ్‌లను కలుపుతూ మెట్రో రైలు వస్తే ఎలివేటెడ్ కారిడార్ అదే పియర్ వ్యవస్థను ఉపయోగించుకునే విధంగా ఫ్లైఓవర్‌ను డిజైన్ చేయాలనుకుంటున్నాము" అని HMDA అధికారి ఒకరు తెలిపారు.