ఫాల్కన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫాల్కన్ ఎండీ అమర్ దీప్ ను ముంబైలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గల్ఫ్ నుంచి ముంబైకి వచ్చిన అమర్ దీప్ ను మంగళవారం ( జనవరి 6 ) అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ముంబై ఇమ్రిగేషన్ అధికారుల సమాచారంతో అమర్ దీప్ అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు తెలంగాణ పోలీసులు. అమర్ దీప్ పై ఇప్పటికే ఎల్ఓసి జారీచేసిన పోలీసులు ఎట్టకేలకు ఇవాళ అరెస్ట్ చేశారు.
MNC కంపెనీలో పెట్టుబడులు, డిజిటల్ డిపాజిట్ల పేరుతో 850 కోట్ల రూపాయలు దోచుకున్నాడు అమర్ దీప్. యాప్ బేసిడ్ డిజిటల్ డిపాజిట్ల పేరుతో మోసానికి పాల్పడ్డాడు అమర్ దీప్. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడతానంటూ భారీగా వసూళ్లు రాబట్టి మోసానికి పాల్పడ్డాడు అమర్ దీప్.
ఫాల్కన్ స్కాం వెలుగులోకి రాగానే దుబాయ్ కి చార్టెడ్ ఫ్లైట్లో పారిపోయిన అమర్ దీప్ ఇవాళ ఇండియాకు వస్తున్నడంటూ ముంబై ఇమ్మిగ్రేషన్ అధికారులు సమాచారం ఇవ్వడంతో ముంబైలో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఫాల్కన్ సీఈఓ తో పాటు అమర్ దీప్ సోదరుడిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు.
