గనుల్లో ఉద్యోగాలకు గండం : 2.60 లక్షల మందిపై వేటు

గనుల్లో ఉద్యోగాలకు గండం : 2.60 లక్షల మందిపై వేటు

న్యూఢిల్లీ: గనుల్లో పనిచేసే 2.60 లక్షల మంది ఇప్పుడు నిత్యం భయంతో బతుకుతున్నారు. ఎందుకంటే వచ్చే మార్చిలో మర్చంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూతబడటం వల్ల 2.60 లక్షల మంది ఉపాధి కోల్పోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత 40 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం తాండవిస్తున్న సమయంలో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాంపిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వే ఆర్గనైజేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓ) లెక్కల ప్రకారం 2011–12 ఆర్థిక సంవత్సరంలో 2.2 శాతం ఉన్న నిరుద్యోగిత రేటు, 2017–18లో ఏకంగా 6.1 శాతానికి పెరిగింది. అంటే ఉద్యోగుల సంఖ్య 4.7 కోట్లు తగ్గింది. లేబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టిసిపేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేటు ఇదే కాలంలో 55.9 శాతం నుంచి 49.8 శాతానికి పడిపోయింది.   ప్రతి వెయ్యి మందిలో ఎంత మంది ఉద్యోగులు కాగలరో నిర్ధారించే లెక్కను లేబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టిసిపేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేటు అంటారు. ప్రతి వెయ్యి మంది కార్మికుల్లో ఎందరు ఏదైనా పనిలో ఉంటారో దానిని వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టిసిపేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేటు అంటారు.

ముడిఇనుముకు ఇబ్బందులు

పలు రాష్ట్రాల్లోని 329 గనుల లీజు వచ్చే ఏడాది మార్చితో ముగుస్తుంది. దీనివల్ల దాదాపు 2.64 లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు కోల్పోతారు. ఈ గనుల్లో 48 గనులకు ఆపరేటివ్ లీజులు ఉన్నాయి. ఇవి మూతబడితే ఆరు కోట్ల టన్నుల ముడిపదార్థాల సరఫరా ఆగిపోతుంది. ముఖ్యంగా ముడి ఇనుము లభ్యత కష్టమవుతుంది. సుప్రీంకోర్టు తీర్పు ఫలితంగా ఒడిశా, ఝార్ఖండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గోవా, కర్ణాటకలోని గనులను మూసివేస్తున్నారు. ఇవి ప్రత్యక్షంగానే రెండు లక్షల మంది ఉపాధి కల్పిస్తున్నాయి. ఇది వరకే గోవాలో గనుల తవ్వకాలను నిలిపివేశారు. ‘‘ప్రస్తుతం మనదేశంలో నిరుద్యోగం విపరీతంగా ఉంది. గనులరంగాన్ని సమర్థంగా ఉపయోగించుకోగలిగితే వ్యవసాయరంగం కంటే 13 రెట్లు, మాన్యుఫ్యాక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంటే ఆరు రెట్లు ఎక్కువ ఉద్యోగాలు కల్పించవచ్చు’’ అని ఫెడరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మినరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఫిమి) సెక్రటరీ జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్కే శర్మ చెప్పారు.

పెట్రోలియం, సహజవాయువు సెక్టర్లను మినహాయిస్తే మిగతా గనులు 2012లో 23 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలను కల్పించాయి. 2.32 కోట్ల మంది కుటుంబాలకు జీవనాధారంగా మారాయి. ప్రభుత్వం జోక్యం చేసుకొని గనులరంగాన్ని చక్కదిద్దితే 2025 నాటికి ఐదు కోట్ల మంది ఉద్యోగాలు ఇవ్వగలుగుతుందని ఫిమి తెలిపింది. ‘‘విధానాలు సక్రమంగా లేకపోవడం, వాటి అమలు కూడా బాగా లేకపోవడంతో ఇండియా గనుల పరిశ్రమ కష్టాల్లో చిక్కుకుంది. న్యాయవ్యవస్థ జోక్యం కారణంగా గత దశాబ్దంలో ఎన్నో గనులు మూతబడ్డాయి. కొన్నింటిని తాత్కాలికంగా నిలిపివేశారు’’ అని పరిశ్రమవర్గాలు తెలిపాయి. మనదేశంలో కన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరువాత అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్నది గనులరంగమే!