‘మహా‘ కేబినెట్ కీలక నిర్ణయాలు

‘మహా‘ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఔరంగాబాద్ (Aurangabad) పేరును మారుస్తామని గతంలో చెప్పిన సీఎం ఉద్దవ్ థాక్రే అలాగే చేశారు. శంభాజీ నగర్ గా మార్చారు. అలాగే.. ఇతర ప్రాంతాల పేర్లను కూడా మార్చేసింది అక్కడి ప్రభుత్వం. జూన్ 29వ తేదీ బుధవారం మహారాష్ట్ర కేబినెట్ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉస్మానాబాద్ (Osmanabad)ని ధరాశివ్ గా మార్చడాన్ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. నవీ ముంబై విమానాశ్రయం పేరును డీబీ పాటిల్ అంతర్జాతీయ విమానాశ్రయం (DB Patil International Airport)గా మారనుంది. 

రాజకీయ సంక్షోభం :-
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం పీక్ స్టేజ్ కు చేరుకుంది. ప్రభుత్వాన్ని బల నిరూపణకు ఆదేశించారు గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ. దీంతో గురువారం మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక భేటీ జరగనుంది. రేపు సాయంత్రం 5 గంటల లోపు బల నిరూపణకు డెడ్ లైన్ విధించారు గవర్నర్. బలనిరూపణకు సిద్ధం కావాలంటూ ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వానికి లేఖ రాశారు. అసెంబ్లీ సమావేశాన్ని వీడియో రికార్డ్ చేయాలని ఆదేశించారు. దీంతో రేపు ఉదయం 11 గంటలకు  ప్రత్యేక అసెంబ్లీ సమావేశం కానుంది. ఈ క్రమంలో సీఎం ఉద్దవ్ థాక్రే కేబినెట్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం ఏర్పాటును బీజేపీ వ్యతిరేకించింది. మైనార్టీలో ఉన్న ప్రభుత్వం ఎలా కేబినట్ నిర్వహిస్తుందని ప్రశ్నించింది. పలు పేర్లను ఉద్దేవ్ ప్రభుత్వం మారుస్తుందని గతంలోనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఔరంగాబాద్ ను శంభాజీనగర్ గా మారుస్తానని తన తండ్రి బాలాసాహెబ్ థాక్రే చేసిన వాగ్ధానం మరిచిపోలేదని గతంలో ఉద్దవ్ వెల్లడించారు. తప్పక పేరు మారుస్తామని హామీనిచ్చారు.

బల నిరూపణకు గవర్నర్ ఆదేశాలు : -
బీజేపీ నుంచి బయటకు వచ్చిన శివసేన మహారాష్ట్రలో ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏక్ నాథ్ షిండే తిరుగుబావుటా జెండా ఎగురవేశారు. హారాష్ట్ర ప్రభుత్వాన్ని బల నిరూపణకు ఆదేశించారు గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ. దీంతో గురువారం మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక భేటీ జరగనుంది. రేపు సాయంత్రం 5 గంటల లోపు బల నిరూపణకు డెడ్ లైన్ విధించారు గవర్నర్. బలనిరూపణకు సిద్ధం కావాలంటూ ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వానికి లేఖ రాశారు. అసెంబ్లీ సమావేశాన్ని వీడియో రికార్డ్ చేయాలని ఆదేశించారు. దీంతో రేపు ఉదయం 11 గంటలకు  ప్రత్యేక అసెంబ్లీ సమావేశం కానుంది. ప్రస్తుతం పేర్ల మార్చడంపై ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.