జూబ్లీహిల్స్, వెలుగు: సీఎం రేవంత్‌రెడ్డి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కార్మిక పక్షపాతులని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాల సవరణకు తీసుకున్న నిర్ణయం కార్మికులకు ఎంతో మేలు చేస్తుందని ఆయన అన్నారు. గురువారం మాల మహానాడు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బైండ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని రాష్ట్ర కార్యాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి వివేక్ వెంకటస్వామి ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు.
కార్మిక సంఘాల వినతులు, పెరుగుతున్న ధరలు, పొరుగు రాష్ట్రాల్లో కార్మికుల వేతనాల పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం 25 నుంచి 36 శాతం వరకు వేతనాలను పెంచడం అభినందనీయమని అన్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షలకు పైగా సంస్థల్లో పనిచేస్తున్న సుమారు కోటి 12 లక్షల మంది కార్మికులకు లాభం చేకూరుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాల మహానాడు విద్యుత్ ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు బూర్గుల విజయభాస్కర్, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శులు పి.జయకుమార్, కె.అనిల్‌కుమార్, జెట్టి గిరి, పాశం గణేశ్, ఓబులేశ్వర్, లక్ష్మీపతి, విజయ్, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.
