ఐస్‌క్రీం పిచ్చి ఒక్కోసారి ఎంత ప్రమాదంలోకి నెట్టేస్తుందో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ వింత ప్రమాదం చూస్తే ఎవరికైనా ఒళ్ళు గగుర్పొడుస్తుంది. మొదటి అంతస్తు బాల్కనీలో నిలబడి, కింద వెళ్తున్న బండివాడి దగ్గర ఐస్‌క్రీం అందుకోబోయి ఓ వ్యక్తి ఏకంగా కింద పడిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన సీసీటీవీ (CCTV) వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అసలేం జరిగిందంటే?
ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో ఒక వ్యక్తి తన ఇంటి మొదటి అంతస్తు బాల్కనీలో నిలబడ్డాడు. అదే సమయంలో కింద రోడ్డుపై ఒక ఐస్‌క్రీం బండి వెళ్తుండటం చూశాడు. మెట్లు దిగి కిందకు వెళ్లడం బద్ధకమో ఏమో కానీ.. పైనుంచే గట్టిగా పిలిచి ఐస్‌క్రీం ఆర్డర్ ఇచ్చాడు.
కింద ఉన్న ఐస్‌క్రీం విక్రేత కూడా పైకి చేయి చాచి ఐస్‌క్రీం అందించబోయాడు. దాన్ని ఎలాగైనా అందుకోవాలనే ఆరాటంలో.. ఆ వ్యక్తి బాల్కనీ రెయిలింగ్‌పై నుంచి బాగా ముందుకు వంగాడు. అంతే, ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి నేరుగా మొదటి అంతస్తు నుండి కింద పడిపోయాడు.
షాక్‌లో స్థానికులు..
అతను అంత పైనుంచి ఒక్కసారిగా కిందపడటం చూసి చుట్టుపక్కల వాళ్లు, ఐస్‌క్రీం బండివాడు షాక్ అయ్యారు. ఇంట్లోని కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే అక్కడికి వచ్చి, గాయపడిన ఆ వ్యక్తిని హాస్పిటల్‌కు తరలించారు.
పోలీసులు ఏమన్నారంటే
ఈ వైరల్ వీడియోపై సోన్‌భద్ర పోలీసులు స్పందించారు. "ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. అతని ఆరోగ్యం ఇప్పుడు నిలకడగానే ఉంది. ప్రాణాపాయం తప్పింది" అని క్లారిటీ ఇచ్చారు.
నెటిజన్ల కామెంట్లు!
ఈ వీడియో ఫుటేజ్ ఆన్‌లైన్‌లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అంత ఎత్తు నుంచి పడినా ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడటం పెద్ద మిరాకిల్ అని నెటిజన్లు అంటున్నారు. అదే సమయంలో..అంత బద్ధకం ఎందుకు.. కిందకు వెళ్లి కొనుక్కోవచ్చు కదా, ఇలాంటి ప్రాణాల మీదకు తెచ్చే పనులు అవసరమా" అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
A man sustained injuries after falling from the roof of his house while attempting to buy an ice cream in Renukoot town of Sonbhadra district.
— Hate Detector 🔍 (@HateDetectors) June 25, 2026
According to reports, the incident took place in the Pipri police station area when the man leaned over the edge of his rooftop toward… pic.twitter.com/ruCSPj41gU
