మీరు కిలో ప్లాస్టిక్ ఇస్తే..మేం కిలోబియ్యం ఇస్తాం

మీరు కిలో ప్లాస్టిక్ ఇస్తే..మేం కిలోబియ్యం ఇస్తాం

ప్రపంచం ఎదుర్కొంటు న్న ప్రధానసమస్యల్లో ఒకటి ఆకలి, రెండోది పర్యావరణ కాలుష్యం . ఈ రెండింటినీ ఒకేసారి పరిష్కరిస్తున్నారు తెలుగు రాష్ట్రాల యువకులు. కిలో ప్లాస్టిక్ ఇస్తే కిలో బియ్యం  ఇస్తా మంటూ ఊరూరా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  ప్లా స్టిక్ వల్ల పర్యావరణానికి కలిగే హానిని తగ్గించాలంటే ప్లా స్టిక్ వాడకుండా ఉండడం పరిష్కారం కాదు. మళ్లీ మళ్లీ ప్లా స్టిక్ ను వినియోగించడం కూడా అవసరమే. కొత్తగా ప్లా స్టిక్ ఉత్పత్తిని తగ్గిస్తే .. ఈరోజు కాకపోయినా రేపటి తరానికైనా ప్లా స్టిక్ ముప్పును తప్పించొచ్చు. ఇదే ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ లోని పెద్దా పురం పట్టణానికి చెందిన కొం దరు యువకులు కిలో ప్లాస్టిక్ ఇస్తే.. కిలో బియ్యం ఇస్తం’అనే నినాదంతో ఊరూరా క్యాంపులు ఏర్పాటు చేస్తున్నా రు.

అవగాహన కల్పిస్తూనే..

ప్లా స్టిక్ వాడకంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూనే, పర్యావరణానికి హాని చేస్తున్న ప్లాస్టిక్ సేక ర ించే ప ని ప్రారంభించారు. ఇందుకోసం ప్లా స్టిక్ సేకరించేవారిని ప్రోత్సహించేందుకు కిలో ప్లా స్టిక్‌‌కి కిలో బియ్యం అందిస్తూ కొత్త ప థ కానికి శ్రీకారం చుట్టారు.

సోషల్ మీడియాలో ప్రచారం..

‘మన పెద్దా పురం’ అనే పేరుతో సోషల్ మీడియా గ్రూప్ ఏర్పాటు చేసి, రకరకాల కార్యక్రమాలను చేపట్టిన ఈ గ్రూప్ .. ప్లా స్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు సోషల్ మీడియా ద్వారా కూడా ప్రచారం చేస్తున్నా రు. గతంలో రక్తదానం, మొక్కల పెంపకం వంటివి సక్సెస్ కావడంతో ప్లా స్టిక్ నియంత్రణ ఉద్యమానికి కూడా సోషల్ మీడియాను వేదికగా ఎంచుకున్నా రు.

గాంధీజయంతి రోజున మొదలు..

పెద్దా పురంతో పాటుగా రెవెన్యూ డివిజ న్ ప రిధిలోని 8 మండ లాల్లో ఈ కార్యక్రమాన్ని గాంధీజయంతి రోజున మొదలుపెట్టారు. ఏలేశ్వరం, సా మర్లకోట తదితర పట్టణాల్లో ‘రైస్ ఫర్ ప్లా స్టిక్ ’ ఉద్యమానికి మంచి స్పందన వచ్చింది.

తెలంగాణలో …

గాంధీ జయంతి రోజున తెలంగాణలోని నిర్మల్ , భైంసా, ములుగు జిల్లాల్లో  ‘రైస్ ఫర్ ప్లాస్టిక్ ’ఉద్యమం మొదలైంది. ములుగులో అక్టోబర్ 26వ తేదీ వరకు ప్లాస్టిక్ తెచ్చిన వారికి దాతల సాయంతో బియ్యం అందజేశారు. నిర్మల్ జిల్లా లోనూ కొందరు యువకులు గ్రూప్ గా ఏర్పడి దాదా పు 13 గ్రామాల్లో ‘రైస్ ఫర్ ప్లా స్టిక్ ’ ఉద్యమాన్ని చేపట్టారు. ఖాళీ సమయాల్లో ప్లా స్టిక్ ను సేకరిస్తూ, ప్లా స్టిక్ వల్ల పర్యావరణానికి కలిగే హానిపై ప్రజలకు అవగాహన కల్పి స్తున్నా రు. గాం ధీ జయంతి రోజున ములుగు జిల్లా కలెక్టర్ ‘రైస్ ఫర్ ప్లా స్టిక్ ’

ఉద్యమాన్ని స్వయంగా ప్రారంభించారు. జిల్లా లోని అన్ని గ్రామాల్లో దీనిని అమలు చేసేందుకు దా తలు ముందుకు రావాలని పిలుపునివ్వడంతో.. ప్రస్తుతం ములుగు జిల్లా లోని 26 గ్రామాల్లో కిలో ప్లాస్టిక్కు కిలో బియ్యం ఇస్తున్నా రు. భద్రాచలంలోని జేడీ ఫౌండేషన్ సంస్థ కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస ్తోంది. భద్రాచలం పుణ్యక్షేత్రాన్ని ప్లా స్టిక్ రహితంగా మార్చేందుకు జేడీ ఫౌండేషన్ కిలో ప్లాస్టిక్ తెస్తే కిలో సన్నబియ్యం అందజేస్తోంది.

ఫిలిప్పీన్స్ లో కూడా..

స్వచ్ఛభారత్ పథకంలోభాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈసారి ప్లా స్టిక్ ను పా రదోలుదామని పిలుపునివ్వడంతో దేశవ్యాప్తంగా చాలామంది సెలబ్రిటీలు స్వచ్ఛందంగా ప్లా స్టిక్ వినియోగానికి దూరంగా ఉంటున్నారు. ఎకోఫ్రెండ్లీ వస్తువులు వాడుతున్నా రు. అయితే.. మనదేశంలో ప్లా స్టిక్ ని యంత్రణ దిశగా చేపడుతున్న కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని ఫిలిప్పీన్స్‌‌ కూడా ప్లా స్టిక్ బ్యా న్ దిశగా అడుగులు వేస్తోంది. ఎక్కడ ప్లాస్టిక్ కనిపించినా.. దాన్ని సేకరించి తమకు ఇస్తే దానికి బదులుగా బియ్యం ఇస్తామని ప్రకటించింది

అక్కడి ఓ గ్రామపంచాయతీ. గ్రామవాసులు తెచ్చిఇచ్చే ప్రతి 2 కిలోల ప్లా స్టిక్‌‌ వ్యర్థాలకుగా ను.. కిలో బియ్యం ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ దెబ్బతో ఆ గ్రామంలో ప్లా స్టిక్‌‌ వేస్టే కనిపించడం లేదట

ఆకలినీ దూరం చేస్తున్నాం..

‘ప్లాస్టిక్ ను సరిగ్గా ఉపయోగించుకుంటే కొత్తగా ఉత్పత్తి చేసే అవసరం రాదు. అందుకే ఉపయోగించి పడేస్తున్న ప్లాస్టిక్ సేకరణ కోసం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం . అయితే ఈ కార్యక్రమం ద్వారా పేదల కడుపు నింపితే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. దీంతో ప్లా స్టిక్ తెచ్చి ఇచ్చినవారికి బియ్యం ఇద్దా మని ని ర్ణయించుకున్నాం. ఎంత ప్లా స్టిక్ తెస్తే అంత బియ్యం ఇస్తామని ప్రచారం చేశాం. ఒక్కరోజులోనే 200 కిలోల ప్లా స్టిక్ ను సేకరించాం. పూట గడవని ఎంతో మంది ప్లా స్టిక్ ను సేకరించి మా వద్దకు తీసుకొచ్చారు.కొందరు స్వచ్ఛందంగా పనికిరాని ప్లా స్టిక్ ను తీసుకొచ్చి ఇచ్చారు. అలా వచ్చిన బియ్యాన్ని అక్కడే పేదలకు పంచేశారు. మేం ప్రారంభించిన ఉద్యమం ప్లాస్టిక్ నియంత్రణతోపాటు పేదల కడుపు నింపుతున్నం దుకు ఎంతో సంతృప్తిగా ఉంది. పిల్లలు, వృద్ధులు, మహిళలు అందరూ ప్లా స్టిక్ ని యంత్రణ కోసం మాకు సహకరిస్తున్నా రు. సేకరించిన ప్లా స్టిక్ వేస్టును మున్సిపాలిటీకి అందజేస్తున్నాం’

– పెద్దిరెడ్ల న రేశ్ ,

‘మన పెద్దా పురం’ గ్రూప్ అడ్మిన్