మణికొండ @ 43.5 డిగ్రీలు... ఈ సీజన్ లో ఇదే అత్యధికం..

మణికొండ @ 43.5 డిగ్రీలు... ఈ సీజన్ లో ఇదే అత్యధికం..

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ లో మంగళవారం ఎండ దంచికొట్టింది. మణికొండలో అత్యధికంగా 43.5 డిగ్రీల టెంపరేచర్ నమోదు కాగా.. కుత్బుల్లాపూర్ 42.8, చందానగర్ లో 42.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 

దీంతో నగర ప్రజలు తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డారు. ఈ సీజన్​లో ఇదే అత్యధికమని, రాబోయే రెండు మూడు రోజులు హీట్ వేవ్స్ పెరిగే అవకాశం ఉందని వాతావారణ శాఖ ప్రకటించింది.