హైదరాబాద్ మదీనాగూడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బట్టల దుకాణంలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. గురువారం ( మే 21 ) మదీనా చౌరస్తాలోని ఎస్వైజె కంప్లెక్స్ లోని బట్టల దుకాణంలో మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ కమ్ముకుంది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఎనిమిది ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఈ ప్రమాదంలో లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన ఎస్వైజె కంప్లెక్స్ లో వందకు పైగా దుకాణాలు ఉన్నట్లు సమాచారం. అయితే.. షాపులు తెరవక ముందే ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
