మౌలుహ్​ గుహకు యునెస్కో గుర్తింపు

మౌలుహ్​ గుహకు యునెస్కో గుర్తింపు

మౌలుహ్​ గుహ... మేఘాలయలోని ఫేమస్​ గుహల్లో ఒకటి. మౌలుహ్​ అనే చిన్న గ్రామంలో ఉన్న ఈ గుహని అక్కడివాళ్లు ‘క్రెమ్ మౌలుహ్​’ అని పిలుస్తారు. ఈ గుహని ‘ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ జియోలాజికల్ సైన్సెస్​’ లిస్ట్​లోని మొదటి వంద గుహల్లో ఒకటిగా యునెస్కో ఈమధ్యే గుర్తించింది. ఏడు కిలోమీటర్ల దూరం ఉన్న మౌలుహ్​ కేవ్​ మనదేశంలోనే నాలుగో పెద్ద గుహ. 

ఈ గుహ ద్వారం సముద్రమట్టం నుంచి పది అడుగుల ఎత్తులో ఉంటుంది. గుహలోపల అడుగు పెడితే....పైకప్పు నుంచి మర్రి ఊడల్లాగ వేలాడుతున్న సన్నని రాతి తోరణాలు చాలా కనిపిస్తాయి. ఇవి రకరకాల ఆకారాల్లో ఉంటాయి. ఇవి లావా, కాల్షియం కార్బొనేట్, బురద, ఇసుకతో ఏర్పడ్డాయి.  గుహలో నడుము లోతు వరకు నీళ్లున్న నీటి గుంతలు చాలానే ఉంటాయి. ఈ గుహలో సూర్యకిరణాలు పడేది  పావు భాగం వరకే.  మిగతా భాగమంతా చీకటిగా ఉంటుంది. అడ్వెంచర్ ట్రిప్స్​ ఇష్టపడేవాళ్లకు ఈ గుహ బాగా నచ్చుతుంది. శ్వాస సమస్యలున్న వాళ్లు ఈ గుహలోకి వెళ్లక పోవడమే మంచిది అంటున్నారు ఎక్స్​పర్ట్స్.