NW చాంపియన్‌షిప్‌లో మీరాకు గోల్డ్‌

NW చాంపియన్‌షిప్‌లో మీరాకు గోల్డ్‌

కోల్‌కతా: మాజీ వరల్డ్‌ చాంపియన్‌ మీరాభాయ్‌ చాను 49 కేజీల కేటగిరీలో  నేషనల్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది.  ఇదే కేటగిరీలో తెలంగాణకు చెందిన ప్రియదర్శిని కాంస్యం, ఇంటర్‌–స్టేట్‌ విభాగంలో గోల్డ్‌ నెగ్గింది. మంగళవారం జరిగిన పోటీల్లో రైల్వేస్‌కు ప్రాతినిధ్యం వహించిన 25 ఏళ్ల మీరా 203( స్నాచ్‌ 88, క్లీన్‌ అండ్‌ జర్క్‌ 115)  కేజీల బరువునెత్తి టైటిల్‌ సాధించింది. ఈ క్రమంలో 201కేజీలతో తన పేరిట ఉన్న నేషనల్‌ రికార్డును మెరుగుపర్చుకుంది.

అంతేకాక ఈ విజయంతో మణిపూర్‌కు చెందిన మీరా వరల్డ్‌ ర్యాంకింగ్‌లో నాలుగో ర్యాంక్‌కు చేరింది.  ప్రియదర్శిని (స్నాచ్‌ 70, జర్క్‌ 98) 168 కేజీల బరువునెత్తి కాంస్య పతకం సాధించింది.  ఇంటర్‌–స్టేట్‌ కేటగిరీ లెక్కన ఆమెకు స్వర్ణం లభించింది. రైల్వేస్‌కు ప్రాతినిధ్యం వహించిన సంజితా చాను(స్నాచ్‌ 80, జర్క్‌ 105) 185 కేజీ బరువునెత్తి సిల్వర్‌ మెడల్‌ దక్కించుకుంది.