ఇప్పటి వరకు మార్కెట్లోకి చాలా ఫోన్లు వచ్చాయి. కానీ… ప్రతి ఫోన్ లో ఏదో ఒక స్పెషాలిటీ ఉంది….అలాంటిదే మరో ఫోన్ అందుబాటులోకి వచ్చింది… అయితే ఈ ఫోన్ గురించి వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మీరు కాల్స్ మాట్లాడటానికి ఇందులో సిమ్ ఉండదు. ఈ మేడిన్ చైనా మొబైల్ స్పెషాలిటీ ఏంటో చూద్దాం.
మనం కామన్ గా ఫోన్ లో చూసేవి యాప్స్ ఆప్షన్స్ లాంటివే…ఈ ఫోన్ కూడా మనకు కావాల్సిన అన్ని రకాల ఫెసిలిటిస్ తోనే కొత్త టెక్నాలజీతో మనకు అందుబాటులోకి వచ్చింది. కామన్ గా మనం చూసే ఫోన్లలో మనం మాట్లాడేది అవతలి వాళ్లకు వినిపించేదుకు స్పీకర్ ఉంటుంది.మన మాట ఆ స్పీకర్ వరకు చేరేందుకు కింద చిన్న చిన్న రంధ్రాలుంటాయి. చార్జింగ్ పెట్టెందుకు పోర్ట్…..అదీ ఓ రంధ్రమే, పాటలు వినడానికి, ఫోన్ మాట్లాడటానికి … హెడ్ ఫోన్స్ పెట్టుకునేలా ఓ పొర్ట్…..అది ఇంకొ రంధ్రం …ఫోన్ ఆన్ ఆఫ్ బటన్ ఒకటి, సౌండ్ కోసం ఇంకో రెండు బటన్లు…ఇలా ప్రతి ఫోన్లొను కనిపించే ఫీచర్లివి.అవేవి లేకుండా అసలు ఫోన్ మాట్లాడటానికి కావాల్సిన సిమ్ లే లేకుండా ఫోన్ వస్తే ….ఇప్పుడు అదే మోడల్ లో వచ్చిన ఫోన్ మైజు జీరో.
డిజైన్ లో చిన్న గీత కానీ రంధ్రం కానీ లేని కేవలం గ్లాస్,మెటల్ తో తయారు చేసిన ఈ ఫోన్ వైర్ లెస్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది.దీంట్లో సిమ్ వేసుకునే ఆప్షన్ లేకుండా ఈ- సిమ్ టెక్నాలజీ తో పనిచేస్తుంది.కాబట్టి ఈ-సిమ్ కనెక్టివిటీ ఉన్న ఆపరేటర్లయితేనే ఈ ఫోన్ పనిచేస్తుంది.వాల్యుమ్ పవర్ బటన్ లు లేవు.కాబట్టి కెపాసిటివ్ సెన్సర్లతో ఈ ఫోన్ పనిచేస్తుంది.హెచ్ టీ సీ యూ 12ప్లస్ మోడల్ లో ఫోన్ అంచుకు కెపాసిటివ్ సెన్సర్లను పెట్టినట్టే దీనికీ పెట్టారు.ఆ సెన్సర్లే పవర్ వాల్యుమ్ బట్లన్లుగా పనిచేస్తాయి.స్పీకర్లు గ్రిల్స్ కు బదులు పీజో ఎలక్ట్రిక్ ట్రాన్స్ డ్యూసర్స్ సాయంతో మాటను అవతలి వారికి చేరవేస్తాయి.మనకు వినపడేలా చూస్తాయి.అందుకు స్క్రీన్ నే అవి వాడుకుంటాయి.ఇయర్ రిసీవర్ గా పనిచేయాలన్నా లౌడ్ స్పీకర్ కావాలన్నా స్క్రీన్ వైబ్రేట్ అవుతుంది.
వైర్ లెస్ చార్జర్ తోనే ఫోన్ బ్యాటరీ ఫుల్ అవుతుంది. 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ దీని సొంతం . మిగతా ఫీచర్లు దాదాపు అన్ని ఫోన్లలాంటివే.20మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా సహ సోని ఐఎంఎక్స్ 380ప్లస్ ఐఎంఎక్స్ 350 రెండు కెమెరాలున్నాయి.ఎలాంటి హోల్స్ లేకపోవడం వల్ల ఈ ఫోన్ వాటర్ , డస్ట్ వల్ల దెబ్బతినే సమస్య ఉండదు. స్నాప్ డ్రాగన్ 845 చిప్ తో పనిచేసే ఈ ఫోన్ 4జీబి ర్యామ్ తో వస్తుంది.5.99 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ ప్లే మరో ఆకర్షణ. ధర , ఎప్పుడు రిలీజ్ చేసేది మాత్రం కంపెనీ వెల్లడించలేదు.జస్ట్ దానీ ఫీచర్లను చూపిస్తూ టీజర్ ను రిలీజ్ చేసిందంతే.
