నర్సింగ్ పోస్టులకు మగవాళ్లూ అర్హులే

నర్సింగ్ పోస్టులకు మగవాళ్లూ అర్హులే

మహిళలనే నియమించాలని చట్టంలో లేదు: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: జూనియర్‌ స్టాఫ్‌ నర్సు పోస్టులకు మహిళలు మాత్రమే అర్హులని పేర్కొంటూ సింగరేణి కాలరీస్‌ సంస్థ ఇచ్చిన నోటిఫికేషన్‌ను హైకోర్టు కొట్టేసింది. మహిళలనే నర్సులుగా నియమించాలని చట్టంలో ఎక్కడా లేదని స్పష్టం చేసింది. నర్సింగ్ పోస్టుల విషయంలో లింగ వివక్ష తగదని పేర్కొంది. సింగరేణి నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ మహ్మద్‌ ఫసీయుద్దీన్‌ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేయగా.. న్యాయమూర్తి జస్టిస్‌ పి.నవీన్‌రావు ఈ తీర్పు ఇచ్చారు. నర్సు పోస్టులకు మహిళలు మాత్రమే అర్హులని పేర్కొనడం.. రాజ్యాంగానికి వ్యతిరేకమని, అది లింగవివక్షే అవుతుందని పిటిషనర్‌ తరఫు లాయర్ వాదించారు. అయితే ఏండ్లుగా నర్సు పోస్టులకు మహిళలనే ఎంపిక చేయడం సంప్రదాయంగా వస్తోందని సింగరేణి తరఫు లాయర్ వాదించారు. ఆ వాదనలను తోసిపుచ్చిన కోర్టు.. సింగరేణి నోటిఫికేషన్‌ చెల్లదని,  పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది.