6న తాండూరులో కాంగ్రెస్​ బహిరంగ సభ

6న తాండూరులో కాంగ్రెస్​ బహిరంగ సభ
  •     హాజరుకానున్న ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి

పరిగి, వెలుగు : ఈ నెల 6న వికారాబాద్ జిల్లా తాండూర్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నామని వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి తెలిపారు. గురువారం పరిగి మండల కేంద్రంలోని తన నివాసంలో రామ్మోహన్ రెడ్డి మాట్లాడారు.

ఈ బహిరంగ సభకు ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారని తెలిపారు. ఈ బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.