పనుల కోసం జిల్లా కలెక్టర్‌‌కు కాల్‌ చేయండి

పనుల కోసం జిల్లా కలెక్టర్‌‌కు కాల్‌ చేయండి
  • బీహార్‌‌ సీఎం నితీశ్‌కుమార్‌‌

పాట్నా: కరోనా నేపథ్యంలో విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా పేదలు, రోజువారి కూలీలు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు పలు చర్యలు చేపట్టయి. దీంట్లో భాగంగా బీహార్‌‌ సీఎం నితీశ్‌కుమార్‌‌ మహాత్మా గాంధీ నేషనల్‌ రూరల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ గ్యారెంటీ యాక్ట్‌ (ఎమ్‌జీఎన్‌ఆర్‌‌ఈజీఏ) కింద పనులు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్‌జీఎన్‌ఆర్‌‌ఈజీఏ కింద పైప్‌లైన్‌ పనులు, ఇంటి పనులు చేయించాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలోని అధికారులు, వివిధ జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నామని, పనులు చేయాలనుకునే వారు జిల్లా కలెక్టర్‌‌కు ఫోన్‌ చేసి పర్మిషన్‌ తీసుకోవాలని సూచించారు. పనులు చేసే దగ్గర జాగ్రత్తలు పాటించాలని , 60 ఏళ్లు పైబడిన వారికి పాస్‌లు జారీ చేయరని స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ కారణంగా వేరే రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వారికి సాయం చేసేందుకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి రూ.50 కోట్లు రిలీజ్‌ చేశారు. పేదవారికి సాయం చేసేందుకు ఒక్కో కుటుంబానికి రూ.వెయ్యి అందించారు. ఒడిశాలో ఈ రోజు నుంచి ఈ – కామర్స్‌ సేవలు ప్రారంభించేందుకు ఆ రాష్ట్ర సీఎం నవీన్‌ పట్నాయక్‌ అనుమతిచ్చారు.