ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్‌తో 12 లక్షల మందికి లబ్ధి 

ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్‌తో 12 లక్షల మందికి లబ్ధి 

హైదరాబాద్: ఉద్యోగులకు వారి కుటుంబీలకు మెరుగైన ఆరోగ్య సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌‌ను తీసుకొచ్చామని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఈ పథకానికి ఏటా రూ.350 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులతోపాటు జర్నలిస్టులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఈహెచ్‌‌ఎస్ కింద 12 లక్షల మందికి లబ్ధి చేకూరుతోందని పేర్కొన్నారు.  కేసీఆర్ కిట్‌తో సర్కార్ ఆస్పత్రుల్లో డెలివరీల సంఖ్య పెరిగిందన్నారు. కేసీఆర్ కిట్‌కు బడ్జెట్‌‌లో రూ.263 కోట్లు కేటాయించామని వివరించారు.