వ్యాపారులతో కలిసి 40 కోట్ల ఫ్రాడ్

వ్యాపారులతో కలిసి 40 కోట్ల ఫ్రాడ్

 హైదరాబాద్​: జీఎస్టీ మోసం కేసులో  ఐదుగురు జీఎస్టీ అధికారులను సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాపారులతో కలిసి జీఎస్టీ అధికారులు మోసాలకు పాల్పడ్డారు. ఎలక్ట్రికల్ ఈ బైక్ కంపెనీ లేకున్నా ఉన్నట్లు సృష్టించి నిందితులు జీఎస్టీ రీఫండ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దాదాపు రూ.40 కోట్లను వ్యాపారులతో కలిసి జీఎస్టీ అధికారులు నొక్కేశారు.

 అరెస్ట్ అయిన వారిలో నల్గొండ జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ స్వర్ణ కుమార్, స్టేట్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్లు వేణుగోపాల్, విశ్వకిరణ్, మహిత, డిప్యూటీ స్టేట్ జీఎస్టీ కమిషనర్ వెంకటరమణను  సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో గతంలో నలుగురు వ్యక్తులను   పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.