జగన్.. అద్దంలో మొహం చూసుకో... షర్మిల

జగన్.. అద్దంలో మొహం చూసుకో... షర్మిల

జగన్ ను గద్దె దించటమే లక్ష్యంగా ఏపీ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన షర్మిల కడప ఎంపీగా బరిలో దిగిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసిన షర్మిల జగన్ పై ప్రత్యక్షంగా విమర్శలు చేస్తూ దూసుకుపోతున్నారు. కడపలో ఎన్నికల ప్రచారం సందర్బంగా ప్రెస్ మీట్లో పాల్గొన్న షర్మిల జగన్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తాను చంద్రబాబు కంట్రోల్లో ఉన్నానని, ఆయన మాటలు వింటున్నానన్న భ్రమలో జగన్ ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో ఏం జరిగినా కేసుల అన్నిటికీ చంద్రబాబునే కారణంగా చూపిస్తున్నారని అన్నారు.

ప్రతిదానికి చంద్రబాబునే కారణంగా చూపిస్తున్న జగన్ మెంటల్ స్టేటస్ గురించి ఆలోచిస్తే తనకు భయం వేస్తుందని అన్నారు షర్మిల. జగన్ ఒకసారి అద్దంలో మొహం చూసుకోవాలని, అద్దంలో తన మొహం కనిపిస్తుందో, లేక చంద్రబాబు మొహం కనిపిస్తుందో చెప్పాలని అన్నారు. తండ్రి పేరును సీబీఐ ఛార్జి షీట్లో చేర్చిన పొన్నవోలు నాగేశ్వరరావుకు ఏఏజీ పదవి ఇచ్చారంటే జగన్ ఎంత దిగజారి పోయాడో అర్థమవుతోందని అన్నారు షర్మిల.