గుడ్‌న్యూస్: Xలో డీప్‌ఫేక్ వీడియోస్ కనిపెట్టే ఫీచర్

గుడ్‌న్యూస్: Xలో డీప్‌ఫేక్ వీడియోస్ కనిపెట్టే ఫీచర్

టెక్నాలజీ పెరుగుతున్నా దాన్ని ఎలా మంచికే వాడుకోవాలని తెలయకుంటే దానివ్లల  చాలా తప్పులు జరిగిపోతుంటాయి. ఏఐ ఫీచర్ వచ్చాక డీప్ ఫేక్ వీడియోలు భయం చాలా మందిలో మొదలైంది. తాజాగా సెలబ్రెటీల డీప్‌ఫేక్ వీడియోలు వైరల్ అయ్యాక.. అవి ఎంత ప్రమాదమో జనాలకు అర్థం అయింది. ట్నెకాలజీ వాడి ఫేక్ వీడియోస్, వాయిస్ రికార్డింగ్స్, మార్ఫింగ్ ఫొటోలు క్రియేట్ చేసి ఏది రియలో.. ఏది ఫేకో గుర్తుపట్టలేతంగా మార్చుతున్నారు. 

ఎలక్షన్స్ టైంలో పొలిటికల్ పార్టీలు అపొసిషన్ లీడర్ల వీడియోస్ డీప్‌ఫేక్ చేసి సోషల్ మీడియాలోకి వదులుతున్నారు. వీటి వల్ల ప్రజలు ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకోలేకపోతున్నారు. ఈ డీప్ ఫేక్ వీడియోస్, మార్ఫింగ్ ఫొటోలకు చెక్ పెట్టాల్సిన టైం వచ్చిందని ఎక్స్ ప్రకటించింది. 

డీప్‌ఫేక్ వీడియోస్‌ను కనిపెట్టి కిల్ చేసే ఫీచర్‪ను ఎక్స్ (ట్విటర్) త్వరలో తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్ ఎక్స్ అధికారిక అకౌంట్ లో తెలిపారు. డీప్ ఫేక్ వీడియోస్, ఫొటోస్, క్రియేట్ చేసే షెల్లో‌ఫేక్స్ లాంటి సాఫ్ట్‌వేర్లను పసిగట్టే విధంగా ఈ ఫీచర్ తయారు చేస్తున్నారు. ఈ అప్డేట్‌తో ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఫొటోస్, వీడియోస్ 30 పర్సెంట్ మ్యాచ్ అయితే ఎక్స్ ఫేక్ వీడియోగా ఐటెంటీఫై చేస్తుంది. దానికి దగ్గరగా మ్యాచ్ అయ్యే కంటెంట్ అటోమేటిక్ గా చూపిస్తదట. పోస్ట్ చేసిన వీడియో లేదా ఫొటో, ఆడియో ఎన్ని  పోస్టులకు రిలేటెడ్ గా ఉందో నెంబర్స్ తో సహా చూపిస్తుందని ఎక్స్ తెలిపింది.