స్కూల్స్, కాలేజీ విద్యార్థులకు అడోబ్ బంపర్ ఆఫర్: ఫోటోషాప్, AI సాఫ్ట్‌వేర్‌లు ఇక ఫ్రీ !

స్కూల్స్, కాలేజీ విద్యార్థులకు అడోబ్ బంపర్ ఆఫర్: ఫోటోషాప్, AI సాఫ్ట్‌వేర్‌లు ఇక ఫ్రీ  !

దశాబ్దాలుగా ఫోటో ఎడిటింగ్ రంగంలో కీలక  పాత్ర పోషిస్తున్న ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ అడోబ్, ఇండియాలోని గుర్తింపు పొందిన కాలేజీలు, యూనివర్సిటీల  విద్యార్థులకు ఖరీదైన   అడోబ్ సాఫ్ట్‌వేర్‌లను ఉచితంగా అందించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 19న జరిగిన ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్‌లో అడోబ్ CEO శంతను నారాయణ్ ఈ విషయాన్ని ప్రకటించారు.


ఏయే సాఫ్ట్‌వేర్‌లు ఫ్రీ అంటే :
అర్హతగల విద్యార్థులు ఫోటో ఎడిటింగ్ కోసం ప్రపంచంలోనే నంబర్ 1 సాఫ్ట్‌వేర్ Adobe Photoshop, PDF ఫైల్స్ మేనేజ్మెంట్ కోసం Adobe Acrobat, Adobe Firefly ఇదొక ఒక లేటెస్ట్ AI (కృత్రిమ మేధ) టూల్. దీని ద్వారా కేవలం టైప్ చేయడం ద్వారా అద్భుతమైన ఇమేజ్‌లను క్రియేట్ చేయడం వంటి ఈ   పాపులర్ సాఫ్ట్‌వేర్‌లను ఉచితంగా వాడుకోవచ్చు:

ఎవరికి అవకాశం ఉంటుందంటే :
ప్రభుత్వ 'కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్'లో భాగంగా ఉన్న 15 వేల స్కూల్స్, 500 కాలేజీల విద్యార్థులకు ఇది వర్తిస్తుంది. ముఖ్యంగా యానిమేషన్, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) రంగాల్లో రాణించాలనుకునే విద్యార్థులకు ఇదొక వరం.

అడోబ్ సంస్థ కేవలం సాఫ్ట్‌వేర్ ఇచ్చి ఊరుకోకుండా, విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వనుంది. స్కిల్స్ డెవలప్మెంట్ కోసం  గ్రాఫిక్ డిజైన్, యానిమేషన్, మార్కెటింగ్ వంటి రంగాలలో సర్టిఫికేట్ కోర్సులను అందిస్తుంది. 2030 నాటికి ఈ రంగంలో 20 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించడమే ప్రభుత్వ లక్ష్యం. దానికి అడోబ్ తన వంతు సహకారం అందిస్తోంది. ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు ఖరీదైన సాఫ్ట్‌వేర్‌లను కొనే పని లేకుండా, లేటెస్ట్ టెక్నాలజీని నేర్చుకుని భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది.