అనారోగ్యంగా ఉందా.. ఫోన్ ద్వారా ట్రీట్ మెంట్

అనారోగ్యంగా ఉందా.. ఫోన్ ద్వారా ట్రీట్ మెంట్

రాష్ట్రంలో ఒకట్రెండు రోజుల్లో టెలీ మెడిసిన్ సేవలను ప్రారంభించనున్నామని మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. లాక్ డౌన్ తో హాస్పిటళ్లకు  వెళ్ల లేక పేషెంట్లు ఇబ్బంది పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. అందువల్ల ఫోన్‌‌లోనే అవసరమైన వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పేషెంట్లనుంచి వచ్చే కాల్స్‌‌కు నేరుగా డాక్టర్ లే  ఆన్సర్‌ చేస్తారని, పేషెంట్ల లక్షణాలను బట్టి మందులు సూచిస్తారని తెలిపారు. మానసిక సమస్యలు ఉన్నవాళ్లుకూడా ఫోన్ చే యొచ్చని, సైకియాట్రిస్ట్ లతో కౌన్సెలింగ్ ఇప్పిస్తా మని తెలిపారు. ఈ మేరకు టెలీ మెడిసిన్‌‌టోల్‌‌ ఫ్రీ నంబర్‌‌‌‌ను ప్రకటిస్తామని చెప్పారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని కోఠిలో ఉన్న కరోనా కమాండ్ కంట్రోల్‌‌సెంటర్‌లో మంత్రి ఈటల మీడియాతో మాట్లాడారు.

తలసేమియా, డయాలసిస్ పేషెంట్లకు ఎదురవుతున్న సమస్యలను తమ దృష్టికి ష్టి తీసుకొస్తే పరిష్కరిస్తామని మంత్రి చెప్పారు. గాంధీలో డయాలసిస్‌‌సెంటర్‌ బంద్ అవడంతో, అక్కడ డయాలసిస్ చేయించుకునే వారిని ఉస్మానియా, ఇతర సెంటర్లకు  షిఫ్ట్‌‌ చేశామన్నారు. తలసేమియా పేషెంట్లకు రక్తం కొరత ఏర్పడుతోందని, దాతలు ముందుకు రావాలని కోరారు.

లాక్ డౌన్ తో  సేవ్ అయినం

లాక్ డౌన్  పక్కాగా అమలు చేయడంతోనే సేవ్ అయ్యామని , లేదంటే పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యేవని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తబ్లిగి జమాత్ ప్రతినిధులు ఢిల్లీ నుంచి తిరిగి రావడం, లాక్‌‌డౌన్‌‌ మొదలవడం ఒకేసారి జరిగాయని.. లేదంటే వాళ ద్వారా వందల మందికి వైరస్ సోకేదని చెప్పారు. మర్కజ్ కేసులు లేకుంటే.. ఇదివరకే తెలంగాణ కరోనాఫ్రీ రాష్ట్రం గా మారేదన్నారు. మొత్తం కేసుల్లో 385 మర్కజ్ లింక్ కేసులేనని చెప్పారు. ఫారిన్ నుంచి వచ్చినోళ్లలో కరోనా బారినపడ్డ వాళ్లంతా కోలుకున్నారని తెలిపారు.

మార్చి 25, 26, 27 తేదీల్లో పాజిటివ్‌‌ వచ్చిన మర్కజ్ వాళ్లకు గురువారం మరోసారి టెస్టులు చేయించామని మంత్రి వెల్ల డించారు. అందులో నెగిటివ్ వస్తే శుక్రవారం మరోసారి టెస్టులు చేయించి, అందులోనూ నెగిటివ్ వస్తే డిశ్చార్జి చేస్తామని తెలిపారు. ప్రస్తుతం 414 మంది కరోనా పేషెంట్లు దవాఖానాల్లో ట్రీట్ మెంట్ పొందుతున్నారని , అందులో ఒక్కరు మాత్రమే వెంటి లేటర్‌ పై ఉన్నారని చెప్పారు. శుక్రవారం సుమారు 60 నుంచి 70 మంది డిశ్చార్జిఅయ్యే అవకాశం ఉందని, ఈ నెల 24 నాటికి అందరూ కోలుకునే చాన్స్ఉందని వెల్ల డించారు. శుక్రవారం నుంచి కరో నా కేసులు తగ్గుముఖం పడతాయన్నారు. అలాగని కరోనాను లైట్ తీసుకోవద్ద ని, అత్యవ సరమైతే తప్ప ఇండ్లనుంచి బయటకు రావొద్ద ని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 101 హాట్‌‌స్పాట్లు రాష్ట్రంలో పాజిటివ్ కేసులు వచ్చిన చోట వైరస్ వ్యాప్తి నివారణ చర్యలు కొనసాగుతున్నాయని ఈటల తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 101 హాట్‌‌స్పాట్లను గుర్తించామని, ఆయా ప్రాంతాల్లో కంటెయిన్‌‌మెంట్ పనులు పకడ్బందీగా చేస్తున్నామన్నారు. ఆ ప్రాంతాల్లో ఇండ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని, అవసర మైన సరుకులు ఇంటికే తెచ్చిస్తామని చెప్పారు. పాజిటివ్ కేసు వచ్చిన ప్రతిచోటా నాలుగైదు కిలో మీటర్లు కంటెయిన్‌‌మెంట్‌‌ చేయాల్సిన అవసరం లేదని.. పేషెంట్ ఉన్న చోట, తిరి గిన చోట చేస్తే సరిపోతుందని తెలిపారు.

కరోనా డౌట్ ఉంటే కోఠి హాస్పిటల్ కు రావాలె 

జలుబు, దగ్గు , తుమ్ములు, గొంతు నొప్పి వంటి లక్షణాలుంటే.. దగ్గర్లోని ప్రభుత్వ దవాఖానాల్లో సంప్రదించాలని ఈటల సూచించారు. హైదరాబాద్‌లో అనుమాని తులు ఉంటే కోఠి హాస్పిటల్‌‌ కు రావాలని.. అక్కడే కరోనా ఓపీ నిర్వహిస్తామని ప్రకటించారు. గాంధీకి వెళ్లొద్దని, అక్కడ పాజిటివ్ పేషెంట్ల కు ట్రీట్‌‌మెంట్ కొనసాగుతుందని చెప్పారు. పాజిటివ్ వచ్చిన వాళ్లను గాంధీకే తరలిస్తా మన్నారు. వెయ్యి  వెంటిలేటర్లు ఆర్డర్ చేశామని, అన్నీ అందుబాటులో ఉన్నాయన్నారు