ప్రైవేట్ ఆస్పత్రులలో లక్ష డిపాజిట్ చేస్తేనే కరోనా ట్రీట్ మెంట్ : స్పందించని మంత్రి ఈటల

ప్రైవేట్ ఆస్పత్రులలో లక్ష డిపాజిట్ చేస్తేనే కరోనా ట్రీట్ మెంట్ :  స్పందించని మంత్రి ఈటల

కరోనా పేషెంట్లకు ట్రీట్ మెంట్ అందించాలని, అందుకోసం ప్రభుత్వం కొన్ని గైడ్ లైన్స్ జారీ చేసింది. ఆ గైడ్ లైన్స్ లను పట్టించుకోని ప్రైవేట్ ఆస్పత్రులు లక్ష డిపాజిట్ చేస్తే ట్రీట్ మెంట్ చేస్తున్నారు.  డిపాజిట్ చేయకపోతే ఆస్పత్రులలో బెడ్ లేవంటూ పేషెంట్లను వెనక్కి పంపిస్తున్నారు. ప్రభుత్వాసుపత్రులో ట్రీట్ మెంట్ తీసుకునేందుకు వచ్చిన కరోనా బాధితుల్ని బెడ్లు లేవని డాక్టర్లు వెనక్కి పంపించడంతో బాధితులు ఇబ్బంది పడుతున్నారంటూ మీడియా ప్రతినిధులు మంత్రి ఈటల రాజేందర్ ను ప్రశ్నించారు. అయితే ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై  స్పందించని ఈటల.. మొత్తం మన దగ్గర 17వేల బెడ్లు ఉన్నాయి. మహబూబ్ నగర్ నుంచి ఆదిలాబాద్ వరకు అన్నీ మెడికల్ కాలేజీల్లో ట్రీట్ మెంట్ అందిస్తున్నట్లు చెప్పారు. కరోనా ట్రీట్ మెంట్ కోసం హైదరాబాద్ కు రావాల్సిన అవసరం లేదని ఆయా మెడికల్ కాలేజీల్లో ట్రీట్ మెంట్ అందిస్తున్నట్లు మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు.

మరో వైపు రాష్ట్రంలో ఉన్న కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులకు చెందిన డాక్టర్లు కరోనా పేషెంట్లను హోం క్వారంటైన్ లో ఉంచే ట్రీట్ మెంట్ ను అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా ఆస్పత్రులను బట్టి ఒక ఆస్పత్రిలో 20వేలు తీసుకుంటుంటే మరో ఆస్పత్రికి చెందిన వైద్యులు 30వేలు ఛార్జ్ చేస్తున్నారు. బాధితుల వద్ద నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేసిన డాక్టర్లు వారికి ఓ కిట్ ను అందిస్తున్నారు.  అనంతరం వారిని ఇంట్లో ఉంచి వీడియో కాల్ ద్వారా ట్రీట్ మెంట్ ఇస్తున్నట్లు సమాచారం.