కుటుంబ సభ్యుల తప్పిదం వల్లే డెడ్ బాడీలు మారుతున్నాయ్ : మంత్రి ఈటల

కుటుంబ సభ్యుల తప్పిదం వల్లే డెడ్ బాడీలు మారుతున్నాయ్  : మంత్రి ఈటల

డెడ్ బాడీలు మార్పు విషయంలో గాంధీ వైద్యులకు సంబంధం లేదని అన్నారు మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.  కరోనా వైరస్ పై హైదరాబాద్ లో జరుగుతున్న అసత్య ప్రచారాల్ని ప్రజలు నమ్మొద్దని మంత్రి ఈటల సూచించారు.  టిమ్స్ (Telangana Institute of Medical Sciences and Research) ఆస్పత్రిని విజిట్ చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఈటల .. కరోనా విషయంలో  నగర ప్రజలు బయపడాల్సిన అవసరం లేదని  .. సోషల్ మీడియాలో వచ్చే  అనవసర ప్రచారాల్ని నమ్మొద్దన్నారు. కరోనా టెస్ట్ లుా  50 వేలు కాదు లక్షల టెస్ట్ లు చేసే సత్తా ఉందని అన్నారు. కొందరు  కరోనా మరణాలపై  అసత్య ప్రచారం చేస్తూ ప్రజల్లో లేని పోని భయాల్ని క్రియేట్ చేస్తున్నారని, ఏం కొంపలు మునిగిపోలేదని అంతా సవ్యంగా ఉందన్నారు. కేసులు ఉన్నా ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఆరోగ్యంగా ఉంటే  వైరస్ టెస్ట్ లు చేయించుకోవద్దన్నారు. వైరస్ సోకిన బాధితుల్ని కాపాడేందుకు డాక్టర్లు నిర్విరామంగా కష్టపడుతున్నారని కొనియాడారు.

కుటుంబసభ్యుల తప్పిందం వల్లే డెడ్ బాడీలు మారుతున్నాయ్ 

ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఎన్నివేల కోట్లు ఖర్చు పెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపిన ఈటల…డెడ్ బాడీలు మారిపోవడంపై స్పందించారు. కుటుంబసభ్యుల తప్పిదాల వల్లే డెడ్ బాడీలు మారిపోతున్నాయని,  డెడ్ బాడీని చూపించి మా కుటుంబ సభ్యుడేనని  తీసుకొని వెళుతున్నారు. తీరా ఆ డెడ్ బాడీలు  మారిపోతున్నాయి. డెడ్ బాడీ లు మారడం కుటుంబసభ్యుల తప్పిదమేనని, కరోనా తో చనిపోయినా డెడ్ బాడీని తీసుకొని వెళ్లేందుకు వారి కుటుంబసభ్యులు ఒప్పుకోవడం లేదని, జీహెచ్ఎంసీ అధికారులే డెడ్ బాడీలను అప్పగిస్తున్నారని అన్నారు.  డెడ్ బాడీలు మారడం విషయంలో  గాంధీ ఆస్పత్రి వైద్యులకు సంబంధం లేదన్నారు.