కోమటిరెడ్డి రాజగోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డిది నిలకడలేని మనస్తత్వం

కోమటిరెడ్డి రాజగోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డిది నిలకడలేని మనస్తత్వం

హైదరాబాద్, వెలుగు: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి వ్యాపారాలు, కాంట్రాక్టుల్లో బీజీగా ఉన్నారని, అందుకే నియోజకవర్గానికి రాలేకపోతున్నారని మంత్రి జగదీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ఎద్దేవా చేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను కుడా పంపిణీ చేసే సమయం ఆయనకు లేదన్నారు. అందుకే మంత్రిగా స్వయంగా తాను రంగంలోకి దిగి చెక్కులను పంపిణీ చేసినట్లు చెప్పారు. ఆదివారం తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మునుగోడు నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరారు. వారికి మంత్రి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

మునుగోడు టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ పార్టీ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. మునుగోడు ఎమ్మెల్యేది నిలకడ లేని మనస్తత్వమని అన్నారు. కాంగ్రెస్ మోసకారి పార్టీగా ప్రజలు గుర్తించారు కాబట్టే చాలా మంది గులాబీగూటిలో చేరుతున్నారని చెప్పారు. మునుగోడు బై ఎలక్షన్ దృష్ట్యా గట్టుప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మండలంగా చేయలేదని, అంతకంటే 15 రోజుల ముందే ఈ విషయమై చర్చించినట్లు తెలిపారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నట్లు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని ఆయన అన్నయ్య వెంకట్​ రెడ్డి ఢిల్లీలో ఎంపీలతో అన్నారని తెలిపారు.