Rathnam Movie Collections: విశాల్కే షాకిచ్చిన రత్నం కలెక్షన్స్.. మరీ ఇంత దారుణమా!

Rathnam Movie Collections: విశాల్కే షాకిచ్చిన రత్నం కలెక్షన్స్.. మరీ ఇంత దారుణమా!

తమిళ స్టార్ విశాల్(Vishal) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ రత్నం(Rathnam). పక్కా మాస్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు హరి(Hari) తెరకెక్కించగా.. లేటెస్ట్ బ్యూటీ ప్రియా భవాని శంకర్(Priya Bhavani Shankar) హీరోయిన్ గా నటించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) సంగీతం అందించిన ఈ సినిమా ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ తో హంగామా చేసిన ఈ సినిమా రిలీజ్ తరువాత మాత్రం అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. 

దాంతో ఈ సినిమా దారుణమైన కలెక్షన్స్ రాబట్టింది. విశాల్ కెరీర్ లోనే ఇదే లోయెస్ట్ కలెక్షన్స్ కావడం విశేషం. మొదటిరోజు రత్నం సినిమా వరల్డ్ వైడ్ గా రూ.3.6 కోట్ల రేంజ్ లో గ్రాస్ రాబట్టింది. విశాల్ గత చిత్రాలతో పోల్చితే ఇది చాలా అంటే చాలా తక్కువ. మొదటిరోజు ఎఫెక్ట్ తో రెండో రోజు కలెక్షన్స్ దారుణంగా తగ్గాయి. రెండోరోజు తమిళంలో రూ.2 కోట్లు.. మిగతా భాషల్లో రూ.55 లక్షలు మాత్రమే రాబట్టింది. ఇక టోటల్ గా రెండు రోజులకు గాను మొత్తంగా రూ.6.6 కోట్ల గ్రస్స్, రూ.3 కోట్లషేర్ ను రాబట్టింది ట్రేడ్ వర్గాల అంచనా.

దీంతో ఈ రత్నం సినిమా నిర్మాతలకు భారీ నష్టాన్ని తెచ్చిపెట్టనుంది. ప్రస్తుత కలెక్షన్స్ చూస్తుంటే ఈ సినిమా బ్రేకివెన్ అవడం కూడా కష్టంగానే ఉంది. నిజానికి విశాల్ ప్రీవియస్ మూవీ మార్క్ ఆంటోనీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.110 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దాంతో రత్నం కూడా అదే రేంజ్ లో కలెక్షన్స్ రాబడుతుంది అనుకున్నారంతా.. కానీ, భారీ డిజాస్టర్ గా నిలిచింది ఈ సినిమా.