HCLTech నికర లాభం రూ. 3,995 కోట్లు

HCLTech  నికర లాభం రూ. 3,995 కోట్లు

2023-24 ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో హెచ్‌సిఎల్‌ టెక్ రూ.3,995 కోట్ల నికర లాభాన్ని శుక్రవారం(ఏప్రిల్ 26) ప్రకటించింది. ఇది గతేడాదితో పోలిస్తే రూ.3,981 కోట్లతో పోలిస్తే 0.35 శాతం పెరిగింది. సీక్వెన్స్‌గా చూస్తే నికర లాభం క్యూ3లో రూ.4,951 కోట్ల నుంచి 19.3 శాతం తగ్గింది.

రూ.26,606 ఏడాది ప్రాతిపదికన చూస్తే.. 7.1 శాతం వృద్ధితో రూ.28,499 కోట్ల ఏకీకృత ఆదాయాన్ని సంపాదించింది హెచ్ సీఎల్. క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఆదాయం రూ.28,446 కోట్ల నుంచి 0.19 శాతం పెరిగింది.కంపెనీ మొత్తం ఆదాయం రూ.28,915 కోట్లుగా ఉంది. గత ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.27,059 కోట్లతో పోలిస్తే ఇది 6.86 శాతం పెరిగింది. 

HCL వద్ద గత పన్నెండు నెలల (LTM) అట్రిషన్ 12.4 శాతంగా ఉంది. ఇది Q4 FY24లో 19.5 శాతానికి తగ్గిందని కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. FY23 చివరినాటికి నివేదించబడిన రూ. 14,845 కోట్ల నుంచి 5.8 శాతం పెరిగి మొత్తం ఆర్థిక సంవత్సరంలో IT కంపెనీ రూ.15,710 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 

FY23 చివరినాటికి రూ. 1,01,456 కోట్ల నుండి 8.3 శాతం పెరిగి.. FY24లో కార్యకలాపాల ద్వారా వచ్చిన  ఆదాయం రూ. 1,09,913 కోట్లు. మొత్తం ఆదాయం కూడా సంవత్సరానికి రూ. 1,02,814 కోట్లు నుంచి 1,11,408 కోట్లకు పెరిగింది. 

వడ్డీ,పన్నులకు ముందు ఆదాయాలు (ఈబిట్) మార్జిన్ 18-19 శాతం మధ్య ఉండవచ్చని కంపెనీ తెలిపింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి కంపెనీకి చెందిన ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.2 చొప్పున మధ్యంతర డివిడెండ్‌గా రూ.18 చొప్పున డైరెక్టర్ల బోర్డు ప్రకటించింది.

కంపెనీ యొక్క Q4 FY24 ఫలితాలకు ముందు HCLTech షేర్లు రూ.1,472.30 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి.