జంటనగరాల అభివృద్దిలో రాజీపడే ప్రసక్తే లేదు: శ్రీధర్ బాబు

జంటనగరాల అభివృద్దిలో రాజీపడే ప్రసక్తే లేదు: శ్రీధర్ బాబు

గ్రేటర్ సిటీ  అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. అభివృద్ధి  పనులకు ప్రణాళిక బద్ధంగా నిధులు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. విపక్షం బాధ్యతాయుతంగా విమర్శలు చేయాలని సూచించారు శ్రీధర్ బాబు.విలువైన సలహాలు,సూచనలు చేస్తే స్వీకరిస్తామని చెప్పారు.  హైదరాబాద్ లో గతంలో మొదలు పెట్టిన పనులు ఎక్కడా ఆపడం లేదన్నారు. జంటనగరాల అభివృద్దిలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు.

 ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్  పనుల్లో   కాంట్రాక్టర్ తో  ఇబ్బందులు ఉన్నాయని..వేరే కాంట్రాక్టర్ తో పనులు చేయిస్తామని చెప్పారు . ఆరాంఘర్ ఫ్లై ఓవర్ 60 శాతం పనులు తామే చేశామని చెప్పారు. ట్రాఫిక్  సమస్య తగ్గడానికే కారిడార్ల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. భూముల విషయంలో కేంద్రంతో సీఎం స్వయంగా మాట్లాడారని చెప్పారు. ప్యారడైజ్ , సుచిత్ర ఫ్లై ఓవర్ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.రక్షణ భూములపై కేంద్రంతో అనేక సార్లు చర్చించామన్నారు. 2250 కోట్లతో సిటీలో రోడ్లు, ఫ్లై ఓవర్లు నిర్మిస్తామని చెప్పారు శ్రీధర్ బాబు. సిటీలో పెద్ద సంఖ్యలో హైరైజ్ బిల్డింంగులు నిర్మానమవుతాయని చెప్పారు. సిటీలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. సిటీ నుంచి ఎయిర్ పోర్ట్ కు రోజూ 20 వేల వాహనాలు నడుస్తాయన్నారు. మూసీ ప్రక్షాళనకు కట్టుబడి ఉన్నామన్నారు శ్రీధర్ బాబు.మూసీలోకి కలుషిత వాటర్ రాకుండా ఎస్టీపీ ల నిర్మాణం చేస్తున్నామని చెప్పారు.