హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో గనుల శాఖపై వాడీవేడీ చర్చ జరిగింది. అన్యాయంగా క్రషర్లు నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోండని.. తాను అసత్య ఆరోపణలు చేస్తే ఉరేయండని హరీష్ రావు సవాల్ చేశారు. హరీష్ రావు ఆరోపణలపై మంత్రి వివేక్ వెంకటస్వామి బదులిస్తూ.. గత పదేళ్లుగా రాష్ట్రంలో జరిగిన ఇసుక దందా, మైనింగ్ అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
మైనింగ్ శాఖను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, అక్రమ మైనింగ్పై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అక్రమాల కట్టడికి పకడ్భందీ విధానాలను అమలు చేస్తున్నామని తెలిపారు. గనుల శాఖలో ఎక్కడా ఆదాయం తగ్గలేదని, గతేడాది మైనింగ్లో 34 శాతం వృద్ధి సాధించామని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఇసుక పాలసీతో వెయ్యి కోట్ల రెవిన్యూ సాధించామని, రంగారెడ్డి జిల్లాలో అక్రమ మైనింగ్పై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు.
మంత్రి వివేక్ వెంకటస్వామి అసెంబ్లీ ప్రసంగం హైలైట్స్:
* ఇల్లీగల్ మైనింగ్ కట్టడి కోసమే కొత్త పాలసీ తెచ్చాం
* 4 నెలలో రెవెన్యూ గ్రోత్ పెరిగింది
* కొత్త పాలసీతో పర్మిట్, సివరేజ్ ఎక్కువ కలెక్ట్ చేసే అవకాశం ఉంది
* సాండ్లో మేము ఈ సంవత్సరం వెయ్యి కోట్ల రెవెన్యూ సాధించాం
* గతంలో రూ.700 కోట్లు మాత్రమే ఉండేది
* రూ. 7.87 కోట్ల పెనాల్టీ వసూలు చేశాము
* మైనర్ మినర్సల్స్ 37 శాతం గ్రోత్ పెరిగింది
* ఎలక్ట్రిసిటీ అవకాశం లేని ప్రాంతాల్లో డీజిల్కి అవకాశం ఇచ్చాము
* ఇల్లీగల్ ప్లాంట్స్ పైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చాం
* ఇల్లీగల్ క్రషర్స్ పైన తప్పకుండా చర్యలు ఉంటాయి
* క్రషర్ యూనిట్ అనుమతులు లేకుంటే చర్యలు ఉంటాయి
