ఇంటర్​ సెకండియర్​ కెమిస్ట్రీ, కామర్స్​లో తప్పులు

ఇంటర్​ సెకండియర్​ కెమిస్ట్రీ, కామర్స్​లో తప్పులు

మొదటి రోజు ఇంటర్​ క్వశ్చన్​పేపర్లలో తప్పులు రాగా చివరిరోజు కూడా అదే రిపీటైంది. సెకండియర్ కామర్స్, కెమిస్ర్టీ పేపర్లలో తప్పులు వచ్చాయి. తెలుగుమీడియంలో నిర్వహించిన కామర్స్ పేపర్​లోని సెక్షన్ ఏలోని 9వ ప్రశ్నలో ‘ఎస్సీ/ఎస్టీ’లకు బదులు, ‘ఎస్సీ/ఎస్’​గా వచ్చింది. అదే ప్రశ్నలో ‘తెలంగాణ’ పేరుకు బదులు ‘తెలంగాక్’​ గా పడింది. కెమిస్ర్టీ తెలుగుమీడియంలో సెక్షన్  బీ లోని 12వ ప్రశ్నలో  ‘మోలారిటీ’కి బదులు ‘మెలోరిటీ’ అని పడింది. సెక్షన్ సీ లోని 19వ ప్రశ్నలో  ‘H2O2’ బదులు ‘H2, O2’ అని వేర్వేరుగా వచ్చింది. కెమిస్ర్టీ ఉర్దూమీడియంలో సెక్షన్​ బీలోని 13 ప్రశ్నలో ‘ఇట్​సాఖ్’ బదులు ‘ఇతాక్’​ వచ్చింది. కాగా ఇంటర్ మేజర్ ఎగ్జామ్స్ ప్రశాంతంగా ముగిశాయని ఇంటర్​ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్​ తెలిపారు. రాష్ర్టవ్యాప్తంగా 9.65లక్షల మంది విద్యార్థులు ఉండగా, 95.72శాతం విద్యార్థులు అటెండ్​అయ్యారని చెప్పారు. మైనర్ సబ్జెక్ట్స్ తో పాటు ఒకేషనల్​ఎగ్జామ్స్​ఈనెల 23 వరకూ కొనసాగనున్నాయని చెప్పారు.  పరీక్షలు ముగియడంతో హాస్టల్స్​లో ఉంటున్న స్టూడెంట్స్​ ఇంటిబాట పట్టారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు మధ్యాహ్నాం నుంచి రద్దీగా మారాయి.

రేపటి నుంచి స్పాట్..

అన్ని సబ్జెక్టులకు ఇంటర్ స్పాట్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. సిబ్బందికి, లెక్చరర్లకు గురువారం ట్రైనింగ్​ఇవ్వనున్నారు. 10వ తేదీ నుంచే సంస్కృతం వాల్యుయేషన్​ షురూ అయ్యింది.

436  మాల్​ ప్రాక్టీస్ కేసులు 

మార్చి 4 నుంచి ప్రారంభమైన ఇంటర్​పరీక్షల్లో మొత్తం 436 మాల్​ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. ఫస్టియర్​లో 116, సెకండియర్​లో 320 కేసులు నమోదు చేశారు. చివరిరోజైన బుధవారమే 60 కేసులు బుక్​ చేశారు. అత్యధికంగా ఈనెల11న జరిగిన సెకండియర్ మ్యాథ్స్​ఏ, బాటనీ, సివిక్స్​పరీక్షల్లో ఏకంగా 90 మందిపై మాల్ ప్రాక్టీస్​కేసులు పెట్టారు. నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి.