రికార్డుల రారాణి మిథాలీ రాజ్

రికార్డుల రారాణి మిథాలీ రాజ్


ఓస్టర్:  విమెన్స్‌‌ క్రికెట్‌‌ క్వీన్‌‌,  ఇండియా టెస్ట్‌‌, వన్డే టీమ్‌‌ కెప్టెన్‌‌ మిథాలీ రాజ్‌‌..  మరో రికార్డు సొంతం చేసుకుంది. ఇంటర్నేషనల్‌‌ క్రికెట్‌‌లో అన్ని ఫార్మాట్స్‌‌లో కలిపి ఎక్కువ రన్స్‌‌ చేసిన మహిళా క్రికెటర్‌‌గా చరిత్ర సృష్టించింది. ఇంగ్లండ్‌‌తో శనివారం జరిగిన మూడో వన్డేలో టార్గెట్‌‌ ఛేజ్​చేస్తుండగా మిథాలీ ఈ ఘనత సాధించింది. మూడు ఫార్మాట్స్‌‌లో కలిపి 10,337 రన్స్‌‌ చేసిన ఆమె వెస్టిండీస్‌‌కు చెందిన చార్లెట్‌‌ ఎడ్వర్డ్స్‌‌(10273 రన్స్‌‌)ను వెనక్కు నెట్టింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో మిథాలీ (75 నాటౌట్‌‌) హాఫ్‌‌ సెంచరీతో బ్యాటింగ్‌‌లో చెలరేగడంతో ఇండియా 4 వికెట్ల తేడాతో గెలిచి ఊరట దక్కించుకుంది. సిరీస్‌‌లో రెండు మ్యాచ్‌‌లు నెగ్గిన ఇంగ్లండ్‌‌ 2–1తో సిరీస్‌‌ కైవసం చేసుకుంది. వర్షం కారణంగా 47 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌‌లో టాస్‌‌ ఓడి ఫస్ట్‌‌ బ్యాటింగ్‌‌ చేసిన ఇంగ్లండ్‌‌219కి ఆలౌటైంది. హేథర్‌‌నైట్‌‌(46), సివర్‌‌(49) రాణించారు. ఇండియా బౌలర్లలో దీప్తిశర్మ(3/47) మూడు వికెట్లు తీసింది.  అనంతరం ఛేజింగ్‌‌లో 46.3 ఓవర్లు ఆడిన ఇండియా ఆరు వికెట్ల నష్టానికి 220 రన్స్​ చేసి మ్యాచ్‌‌ గెలిచింది. స్మృతి మంధాన(49), షెఫాలీ వర్మ(19) మంచి స్టార్ట్‌‌ ఇవ్వగా.. చివరిదాకా క్రీజులో నిలబడిన మిథాలీ.. మ్యాచ్‌‌ను గెలిపించింది. ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌ అవార్డు నెగ్గిన ఆమె  ఛేజింగ్‌‌లో సివర్‌‌ వేసిన 24వ ఓవర్లో కొట్టిన ఫోర్‌‌తో హయ్యెస్ట్‌‌ రన్స్‌‌ రికార్డును అందుకుంది. ఓవరాల్‌‌గా విమెన్స్‌‌ క్రికెట్‌‌లో మిథాలీ,  ఎడ్వర్డ్స్‌‌ మాత్రమే పది వేల రన్స్‌‌ క్లబ్‌‌లో ఉన్నారు. ఇంటర్నేషనల్‌‌ క్రికెట్‌‌లో 22 ఏళ్లు పూర్తి చేసుకున్న మిథాలీ తాజా విక్టరీతో వన్డేల్లో ఎక్కువ విజయాలు సాధించిన కెప్టెన్‌‌గాను హిస్టరీ క్రియేట్‌‌ చేసింది. కెప్టెన్‌‌గా 140 మ్యాచ్​లు ఆడిన రాజ్‌‌84 వన్డేల్లో నెగ్గింది. 101 మ్యాచ్‌‌ల్లో 83 విక్టరీలతో ఇప్పటిదాకా టాప్‌‌ ప్లేస్‌‌లో ఉన్న ఆస్ట్రేలియా విమెన్స్‌‌ మాజీ కెప్టెన్‌‌ బెలిందా క్లార్క్‌‌ను అధిగమించింది.  

రికార్డుల రారాణి

విమెన్స్‌‌ క్రికెట్‌‌లో ఆల్‌‌టైమ్‌‌ గ్రేటెస్ట్‌‌ ప్లేయర్లలో ముందుండే 38 ఏళ్ల మిథాలీకి  రికార్డులు  కొత్తేం కాదు. ఈ హైదరాబాదీ ఖాతాలో ఇప్పటికే ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి.  విమెన్స్‌‌ వన్డేల్లోనూ హయ్యెస్ట్‌‌ స్కోరు రికార్డు మిథాలీ పేరిటే ఉంది. 2017లో జరిగిన వన్డే వరల్డ్‌‌ కప్‌‌లో ఎడ్వర్డ్స్‌‌నే వెనక్కు నెట్టి ఈ రికార్డు సొంతం చేసుకుంది.  217 వన్డేలు ఆడిన ఇండియా కెప్టెన్‌‌ ప్రస్తుతం 7304... రన్స్‌‌తో ఉండగా మరే క్రికెటర్‌‌ కూడా 6 వేల రన్స్‌‌ మార్కు చేరుకోలేదు. ఈ ఫార్మాట్‌‌లో టాప్‌‌10 స్కోరర్లలో 50 ప్లస్‌‌ యావరేజ్ ఉన్న ఏకైక ప్లేయర్‌‌ రాజ్‌‌ కావడం విశేషం. మిథాలీ ఖాతాలో ప్రస్తుతం 58 ఫిఫ్టీలు ఉన్నాయి. విమెన్స్‌‌ వన్డేల్లో హయ్యెస్ట్‌‌ హాఫ్‌‌ సెంచరీలు తనవే. 2019 సెప్టెంబర్‌‌లో మిథాలీ టీ20 క్రికెట్‌‌కు రిటైర్మెంట్‌‌ ఇచ్చింది. 89 మ్యాచ్‌‌ల్లో 96.33 స్ట్రయిక్‌‌ రేట్‌‌తో 2364 రన్స్‌‌ చేసిన ఆమె ఈ ఫార్మాట్‌‌ టాప్‌‌ స్కోరర్లలో ఏడో ప్లేస్‌‌లో నిలిచింది. ఇప్పటిదాకా 11 టెస్టులు ఆడిన హైదరాబాదీ 669 రన్స్‌‌ చేసింది.


 

మరిన్ని వార్తలు