Actress Swathi: ఛీ.. నీ బతుకు.. కలర్స్ స్వాతిపై షాకింగ్ కామెంట్ చేసిన నెటిజన్

Actress Swathi: ఛీ.. నీ బతుకు.. కలర్స్ స్వాతిపై షాకింగ్ కామెంట్ చేసిన నెటిజన్

ఈమధ్య సోషల్ మీడియాలో సెలబ్రెటీలపై ట్రోలింగ్ బాగా పెరిగిపోయింది. ఎవరు పడితే వాళ్లపై.. ఎలా పడితే అలా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఫిమేల్ సెలబ్రెటీల గురించి చెప్పనక్కరలేదు. వారిపై కూడా బ్యాడ్ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు. తాజాగా టాలీవుడ్ నటి స్వాతి కూడా ఇలాంటి సంఘటనే ఎదురయ్యింది. ఆమెను ఒక నెటిజన్ ఛీ.. నీ బతుకు అంటూ దారుణంమైన కామెంట్స్ చేశాడు. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. నటి స్వాతి ఇటీవల తన సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో స్వాతి తన ఫ్యామిలీని పరిచయం చేశారు. అయితే ఆ వీడియోకి ఓ నెటిజన్.. ఛీ.. నీ బతుకు అంటూ దారుణమైన కామెంట్ చేశారు. ఆ కామెంట్ చూసిన స్వాతి ఆ నెటిజన్ కి షాకింగ్ కౌంటర్ ఇచ్చింది. ఆ కామెంట్ కి సంబంధించిన స్క్రీన్ షాట్స్ నీ షేర్ చేస్తూ.. కొన్నిసార్లు నాక్కూడా అలాగే అనిపిస్తుంది. కానీ, వెంటనే మళ్లీ ముందుకు వెళ్లాలని ఆలోచిస్తాను.. థాంక్యూ నా బుజ్జి బతుకు.. అంటూ సెటైరికల్ కామెంట్ కామెంట్ చేసింది. అంతేకాదు.. తన బతుక్కి దిష్టి తగలకుండా దిష్టి సంబల్ యాడ్ చేసింది. ప్రస్తుతం స్వాతి చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Also Read:కత్తి నేనే…నెత్తురు నాదే.. యుద్దం నాతోనే అంటున్న విజయ్ దేవరకొండ

ఇక నటి స్వాతి విషయానికి వస్తే.. ప్రముఖ ఛానల్ లో కలర్స్ అనే షో ద్వారా యాంకర్ గా పరిచయమయ్యారు స్వాతి. తన క్యూట్ క్యూట్ మాటలతో చిలిపి చేష్టలతో ఆడియన్స్ ను ఆకట్టుకున్న ఆమె.. ఆ తరువాత నటిగా మారారు. అలా.. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, మిరపకాయ్, కందిరీగ వంటి సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ కనిపంచిన ఆమె.. అష్టా చెమ్మ సినిమాతో హీరోయిన్ గా మారారు. ఆతరువాత నిఖిల్ హీరోగా వచ్చిన స్వామిరారా, కార్తికేయ సినిమా విజయాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు స్వాతి. చాలాగ్యాప్ తరువాత ఇటీవలే  ఆమె నటించిన లేటెస్ట్ మూవీ మంత్ ఆఫ్ మధు మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.